Kangana Ranaut | కంగనా రనౌత్. పరిచయం అక్కర్లేని పేరు. ఈ బాలీవుడ్ క్వీన్ తాను నటించే సినిమాల కంటే ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటుంది. బాలీవుడ్‌లో నెపోటిజంపై దుమ్ముత్తిపోసే కంగనా.. మరోసారి హిందీ సినీ పరిశ్రమను శాపనార్థాలు పెట్టింది. కంగనా రనౌత్ సోమవారం ట్విట్టర్‌లో ఆస్క్ (AskKangana) సెషన్‌ను నిర్వహించింది.
ఈ సందర్భంగా నెపో మాఫియాపై విరుచుకుపడ్డ క్వీన్.. రిషబ్ శెట్టి, మృణాల్ ఠాకూర్ సహా పలువురు నటులను ప్రశంసించింది. అదే సమయంలో బాలీవుడ్ స్టార్ కిడ్స్ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. సోమవారం దాదాసాహేబ్ ఫాల్కే అవార్డుల ప్రదానం జరిగింది. ఇందులో ఉత్తమ నటుడిగా రణబీర్ కపూర్ (బ్రహ్మాస్త్ర), ఆలియా భట్ (గంగూబాయి కతియావడి) చిత్రాలకు అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ అవార్డులు పెద్ద మోసంగా అభివర్ణించిన కంగన.. వాస్తవానికి ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి (కాంతారా), ఉత్తమ నటి మృణాల్ ఠాకూర్ (సీతారామం), ఉత్తమ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్), ఉత్తమ సహాయ నటుడు అనుపమ్ ఖేర్ (కశ్మీర్ ఫైల్స్), ఉత్తమ సహాయనటి టబు (దృశ్యం-2, భూల్ బూలయ్య-2) అవార్డులు ఇవ్వాల్సిందని అభిప్రాయ పడింది.
బిజీ షెడ్యూల్‌లో కొంత ఖాళీ సమయం దొరికినా తాను అవార్డులకు అర్హులని భావించే వారి జాబితాను ప్రకటిస్తానని చెప్పింది. ఇదిలాఉండగా.. కంగనా ఆస్క్ కంగనా సెషన్‌లో పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానలు ఇచ్చింది. సినిమాల నుంచి వ్యక్తిగత, రాజకీయాల వరకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ.
Awards season is here and nepo mafia is at it again, snatching all awards from the deserving talent. Here’s a list of some of those who displayed volcanic artistic brilliance and owned 2022.
Best Actor -Rishab Shetty ( Kantara)
Best Actress-Mrunal Thakur ( Sita Ramam)
(Cont)— Kangana Ranaut (@KanganaTeam) February 21, 2023