విధాత, హైదరాబాద్ : కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగానే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ విచారణ పేరుతో వేధిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బుధవారం కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు కేసీఆర్ హాజరైన సందర్భంగా బీఆర్కే భవన్ ముందు కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ తీరును నిరసిస్తు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే కమిషన్ల విచారణల పేరుతో ఇబ్బంది పెడుతున్నారన్నారు. కేసీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ కుట్రలన్నీ
కమిషన్ ముందు బట్టబయలైతాయన్నారు. ఇరిగేషన్ పై కేసీఆర్ కు ఉన్న అవగాహన ఎవరికి లేదన్నారు. కమీషన్ ముందు కేసీఆర్ ప్రశ్నించడం అంటే… హనుమంతుడి ముందు కుప్పి గంతులు వేయటమేనన్నారు. కమీషన్ ముందు హరీశ్ రావు సమాధానం తోనే కాంగ్రెస్ , బీజేపీల ఫీజ్ లు ఎగిరి పోయాయని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్, కొన్ని రోజులు కాళేశ్వరం, ఫార్మలా ఈ రేసింగ్ అంటూ నాటకాలు ఆడుతుందని కేటీఆర్ విమర్శించారు. నిజం నిలకడగా తెలుస్తుందని..అంతిమంగా ధర్మం గెలుస్తుందన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కాంగ్రెస్, బీజేపీ లాంటి చిల్లర రాజకీయ పార్టీలు ఉన్న రాష్ట్రంలోర కాకుండా వేరే దేశంలో నిర్మించి ఉంటే.. అది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేదని..ఒక అత్యుత్తమ పురస్కారం కూడా కేసీఆర్ కి వచ్చి ఉండేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. వంద జన్మలు ఎత్తినా రేవంత్ రెడ్డి అనే చిల్లర వ్యక్తికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదన్నారు. రేవంత్ ఎన్ని చిల్లర కుట్రలు చేసినా… కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరని మండిపడ్డారు. కేసీఆర్ బలం, జీవనదృక్కోణాన్ని అర్థం చేసుకోవడానికి జోకర్ కాంగ్రెస్ నాయకులకు జీవితకాలం కూడా చాలదన్నారు. కేబినెట్ ఎలా పనిచేస్తుందో కూడా రేవంత్ రెడ్డికి తెలియదని..శాఖల పంపకం కోసం సీఎం మూడు రోజుల్లో ఢిల్లీ అధిష్టానం వద్ద పడిగాపులు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎంత వాటర్ ఫ్లో వచ్చినా కాళేశ్వరం తట్టుకుందని..కాంగ్రెస్ వెదవలు కాళేశ్వరం డామేజ్ చేసి ఉంటారని..నాకు అదే అనుమానంగా ఉందని కేటీఆర్ ఆరోపించారు.