Site icon vidhaatha

KCR: కేసీఆర్ ఓపెన్ కోర్టు విచారణ రద్దు!

విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు అవతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విచారణ కొనసాగుతుంది. అయితే ముందుగా నిర్ధేశించనట్లుగా ఓపెన్ కోర్టు విచారణ కాకుండా ఇన్ కెమెరా విచారణ జరుగుతుంది. అనారోగ్యం నేపథ్యంలో ఓపెన్ కోర్టు విచారణకు బదులుగా ఇన్ కెమెరా విచారణ చేయాలని కేసీఆర్ చేసిన అభ్యర్థన మేరకు జస్టిస్ ఘోష్ ఓపెన్ కోర్టు విచారణ రద్దు చేసి అందరిని బయటకు పంపించి కేసీఆర్ ను విచారిస్తున్నారు. కేసీఆర్ ను వరుసగా ఒక్కో ప్రశ్న వేస్తూ పీసీ ఘోష్ విచారణ చేస్తున్నారు.

ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుల డిజైన్ల రూపకల్పనలో మీ పాత్ర ఏంటి? 2. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కారణం ఏంటి?
3. ప్రాజెక్టు పూర్తి కాకముందే బిల్లులు ఎందుకు చెల్లించారు? 4. కాళేశ్వరం ప్రాజెక్టును ఎప్పుడు ఆమోదించారు? 5. మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పాటైంది? 6. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గ ఆమోదం ఉందా? 7. సబ్ కమిటీ సిఫార్సులకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం ఉందా? 8. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నిర్మాణ వద్ద రాతి పునాది ఉందా? 9. మేడిగడ్డ ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మార్చారు? వంటి పలు ప్రశ్నలకు ఘోష్ కమిషన్ కేసీఆర్ నుంచి జవాబు రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ అవతవకలపై కాగ్, విజిలెన్స్ కమిషన్, ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికల అంశాలతో పాటు ఘోష్ కమిషన్ ఇప్పటికే ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులను విచారించిన అంశాల నేపథ్యంలో కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version