విధాత, నిజామాబాద్(ఉమ్మడి జిల్లా)బ్యూరో: నిజామాబాద్ నగరంలోని మోడ్రన్ ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు వెంకటరమణను విద్యార్థినిల తల్లిదండ్రులు శుక్రవారం చితకబాదారు.
పాఠశాలలో బయోలాజికల్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ గత కొంత కాలంగా విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించడంతో విద్యార్థినిలు తమ కుటుంబ సభ్యులకు తెలిపారు.
దీంతో కొపోద్రిక్తులైన కుటుంబసభ్యులు ఉపాధ్యాయుడిని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పచెప్పారు. పాఠశాల యాజమాన్యం సదరు ఉపాధ్యాయున్ని విధుల నుంచి తొలగించి విచారణ జరుపుతున్నారు.