<p>Khammam సోనియా సమక్షంలో కాంగ్రెస్ తీర్థం విధాత, హైదరాబాద్: బీఆరెస్ సీనియర్ నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆరెస్ పార్టీకి రాజీనామా చేశారు. గత కొద్దిరోజులుగా కాంగ్రెస్‌పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న క్రమంలో శనివారం బీఆరెస్ అధినేత సీఎం కేసీఆర్‌కు ఆయన రాజీనామా లేఖను పంపారు. ఆదివారం జరుగనున్న కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభలో సోనియా గాంధీ సమక్షంలో తుమ్మల తన అనుచరులతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.</p>