KRK | తనను తాను బాలీవుడ్ క్రిటిక్‌గా చెప్పుకునే కేఆర్‌కే ఎప్పుడు వివాదాస్పద కామెంట్లు చేయడం అలవాటు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రటీలను విమర్శించి చిక్కుల్లో పడ్డాడు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తుంటాడు.. విమర్శలు చేస్తూ వస్తుంటాడు కమల్ రషీద్ ఖాన్. ఎప్పుడు అవకాశం దొరికినా బాలీవుడ్‌తో పాటు సినీ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు. తాజాగా బాలీవుడ్ బిజినెస్ కేవలం గాసిప్‌లపైనే నడుస్తుందంటూ వ్యాఖ్యాంనించాడు.
బాలీవుడ్ గురించి గాసిప్స్ భారతదేశంలో తప్ప ఎక్కడా నేరం కాదు, ఎందుకంటే బాలీవుడ్ వ్యాపారం కేవలం గాసిప్‌లపైనే నడుస్తుందంటూ ట్వీట్ చేశాడు. బాలీవుడ్ సినిమా బడ్జెట్, బిజినెస్ గురించి సాధారణ ప్రజలు చర్చించొద్దని కోరాడు. సినిమా బడ్జెట్, ఓపెనింగ్స్, వ్యాపారం గురించి రాస్తే.. అది సాధారణ ప్రజలకు ఏమీ అర్థం కాదు. ఇది బాలీవుడ్‌తో అనుబంధం ఉన్న వ్యక్తులకు మాత్రమే తాను ఏం మాట్లాడుతున్నానో.. వారికి మాత్రమే బాగా తెలుస్తుంది.. అందుకే సినిమా బడ్జెట్, బిజినెస్ గురించి సామాన్యులు ఆలోచించే బదులు.. ఉద్యోగాలపై దృష్టి పెట్టాలని కోరారు.
కేఆర్‌కే ట్వీట్లపై పలువురు మండిపడుతుండగా.. మరికొందరు మద్దతు తెలిపారు. ఓ యూజర్ స్పందిస్తూ.. ‘హే సోదరా, నన్ను క్షమించు అంటూ ట్వీట్ చేయగా.. మరో యూజర్ ‘నేను నా జీవితంలో తొలిసారిగా మీతో ఏకీభవిస్తున్నాను’ అంటూ కామెంట్ చేశాడు. ఇదిలా ఉండగా ఇటీవల కేఆర్‌కే.. ఇటీవల కియారా అద్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. పెళ్లికి ముందే కియారా ప్రెగ్నెంట్ అని పేరు చెప్పకుండా.. ప్రెగ్నెన్సీ, తర్వాత పెళ్లి తంతు ట్రెండ్ కొనసాగుతోందని వెల్లడిస్తూ.. రీసెంట్‌గా పెళ్లి చేసుకున్న జంట కూడా ఇదే ఫార్ములా ఫాలో అయ్యిందని కామెంట్స్ చేశాడు. ఇంతకు ముందు అలియా భట్ – రణబీర్ కపూర్ జంట పెళ్లయిన రెండు నెలలకే ప్రెగ్నెంట్ అని ప్రకటించిన విషయం తెలిసిందే.