ఒకప్పుడు ఇతర భాషలలో తెగ సందడి చేసిన మృణాల్ ఠాకూర్ ఇప్పుడు తెలుగులో రచ్చ చేస్తుంది. హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం చిత్రంతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ అందాల ముద్దగుమ్మ అక్కడ నుండి వరుస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతుంది. పెద్ద పెద్ద సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పుడు ఆమె సినిమాల లైనప్ చూస్తే ఎవరికైన మతి పోతుంది. త్వరలో ఫ్యామిలీ స్టోరీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ముద్దుగుమ్మ తాజా ఇంటర్వ్యూలో తనపై గతంలో బాడీ షేమింగ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయని తెలిపింది.
సోషల్ మీడియాలో హీరోయిన్ల బాడీ పార్ట్స్ పై ట్రోలింగ్స్ పై మృణాల్ ఠాకూర్ చాలా సీరియస్ అయింది.కొంత మంది హీరోయిన్స్ తమని వస్తువులా చూస్తారంటూ వాపోయింది. కొన్ని పార్ట్‌లపై ఎక్కువగా ఫోకస్ చేసి వాటిని జూమ్ చేసి మరీ దారుణమైన కామెంట్స్ చేస్తారు. వాటిని రకరకాలుగా మార్చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని, వాటికి తాను కూడా అతీతం కాదంటూ మృణాల్ ఠాకూర్ తెలియజేసింది. ఇలాంటివి తనకు ఎంతో బాధ కలిగించిందని పేర్కొంది. నాపై బాడీ షేమింగ్ ట్రోల్స్ కూడా చాలా చేశారు.
నేను సెక్సీగా ఏ మాత్రం ఉండనని, పల్లెటూరి పిల్ల అని, బరువు తగ్గమని సలహాలిస్తూ బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు. కెరీర్‌లో బాడీ షేమింగ్ కామెంట్లని, ట్రోల్స్ ని తాను ఎంతో ఎదుర్కొన్నట్టు సీతారామం బ్యూటీ చెప్పుకొచ్చింది. డాక్టర్ కావల్సిన ఈ భామ యాక్టర్ అయింది. ముందుగా టీవీ నటిగా కెరీర్ స్టార్ చేసి అక్కడ నుండి సినిమా హీరోయిన్‌గా మారేందుకు చాలా కష్టాలు పడింది. ముందుగా బాలీవుడ్‌లో ఒక ఆఫర్ వచ్చిందని, ఆ తర్వాత నెమ్మదిగా చిన్నవి, పెద్దవి ఆఫర్లు చేసుకుంటూ ముందుకు వెళ్లింది. పదేళ్ల స్ట్రగుల్ తర్వాత మృణాల్‌కి స్టార్ స్టేటస్ దక్కింది. ఇక మృణాల్ నటించిన `ఫ్యామిలీ స్టార్` ఏప్రిల్ 5న విడుదల కానుంది. `కల్కి2898ఏడీ`లో గెస్ట్ రోల్ చేస్తున్న ఈ బ్యూటీ ప్రభాస్‌తో కలిసి మరో సినిమా చేయబోతున్నట్టు సమాచారం.