Rahul Marraiage |
- మీ అమ్మ మాట వినడం లేదటగా..
- ఇప్పటికైనా ఇంకా మించిపోలేదు..
- పాట్నాలో విపక్షాల సమావేశంలో
- రాహుల్ లాలూ మధ్య ఆసక్తికర చర్చ
విధాత: దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లలో ఒకరైన రాహుల్‌గాంధీ పెండ్లి ప్రస్తావన మరోసారి చర్చలోకి వచ్చింది. బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం జరిగిన విపక్షాల సమావేశం ఇందుకు వేదికైంది. 15కు పైగా విపక్ష పార్టీలకు చెందిన 30 మంది కీలక నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ప్రతిపక్ష నేతలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పని చేయాలని నిర్ణయించారు.
జాతీయ అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలోనే నవ్వులు, జోకులు కూడా విరబూశాయి. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తన దైనశైలిలో రెచ్చిపోయారు. రాహుల్ జీ.. “నువ్వు పెళ్లి చేసుకో.. మేం పెళ్లి ఊరేగింపుకు వస్తాం” అని సలహా ఇచ్చారు. ఇది విన్న రాహుల్‌తోపాటు అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా నవ్వుకున్నారు. సీరియస్ వాతావరణం లాలూ వ్యాఖ్యలతో ఒక్కసారిగా మారిపోయింది.
‘గడ్డం పెంచవద్దు’
రాహుల్ గాంధీ గడ్డాన్ని చూపిస్తూ.. ‘నువ్వు తిరగడం మొదలుపెట్టి గడ్డం పెంచావు.. ఇక తీసేయి’ అని అన్నారు. లాలూ ఇంకా మాట్లాడుతూ, ‘మీరు మా సలహా వినలేదు, పెళ్లి చేసుకోలేదు. ఇంకా సమయం దాటలేదు. మీరు పెళ్లి చేసుకోండి, మేము మీ పెండ్లి బరాత్‌కు వస్తాం. మీ అమ్మ (సోనియాగాంధీ) మా మాట వినడం లేదని, పెళ్లి చేసుకో అని ఆమె చెబుతుంటారు అని ఆయన అన్నారు.
లాలూ తీరు చూసి అక్కడున్న నేతలు, ఇతరులు నవ్వడం మొదలుపెట్టారు. లాలూ సూచనకు 53 ఏళ్ల రాహుల్ గాంధీ నవ్వుతూ బదులిచ్చారు. ఇప్పుడు మీరు ( లాలూ) దాని (పెళ్లి) గురించి చెప్పారు కదా ఇక అది(పెళ్లి) జరుగుతుంది’ అని రాహుల్ చెప్పారు. సమావేశం ముగిసిన తర్వాత రాహుల్ గాంధీకి లాలూ ప్రసాద్ యాదవ్ ఇచ్చిన సలహా విన్న విలేకరులు కూడా ఒక్కసారిగా నవ్వుకున్నారు.