నిజామాబాద్(ఉమ్మడి జిల్లా)బ్యూరో: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమర్యాగడి తండా అటవీ ప్రాంతంలో శుక్రవారం గొర్రెల మందపై చిరుత పులి దాడి చేసింది. ఈ ఘటనలో ఒక గొర్రెకు తీవ్ర గాయాలైనట్లు ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారి ఓంకార్ తెలిపారు.
తండా వాసి గొర్రెలు మేపుతుండగా ఒక్కసారిగా చిరుత దాడి చేయడంతో స్థానికులు అరుపులు, కేకలు వేయడంతో చిరుత పారిపోయిందని తెలిపారు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
కాగా గత కొన్ని రోజుల క్రితం చిరుత పిల్లలు కనిపించినట్లు తండావాసులు తెలిపారు. అటవీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. చిరుతను పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేస్తామని, ఎవరు భయ పడవద్దని ఓంకార్ సూచించారు.