Site icon vidhaatha

Suryapet | సర్పంచ్ హత్య కేసులో ఆరుగురికి జీవిత ఖైదు

Suryapet | విధాత: సూర్యాపేట జిల్లా మునగాల (మం) నర్సింహులగూడెం సీపీఎం పార్టీ సర్పంచ్ జూలకంటి పులిందర్ రెడ్డి హత్య కేసులో ఆరుగురు వ్యక్తులకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. 2014 జనవరి 30న జరిగిన హత్య కేసు విచారణలో నేడు కోర్టు తుది తీర్పునిచ్చింది.

కాగా.. నిందితుల్లో ఒకరైన జలీల్ అనే వ్యక్తి ఇప్పటికే మరణించగా మిగతా ఐదుగురు నిందితులు షేక్ షబ్బీర్‌, కొప్పుల లక్ష్మినారాయణ, షేక్ ఇబ్రహీం, మాతంగి శ్రీను, దూళిపాల నరేందర్‌, శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో నర్సింహుల గూడెం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.

Exit mobile version