Lokesh
విధాత: యువనేత లోకేష్ మాట మార్చారు. తాను ఎవరికీ టికెట్స్ ఇవ్వలేదని.. అందరికీ పార్టీ అధిష్టానం టికెట్స్ ఖరారు చేస్తుందని చెప్పి తప్పుకున్నారు. మహానాడులో పాల్గొనేందుకు యువగళం పాదయాత్రకు నాలుగు రోజులు సెలవు ప్రకటించి మరీ వచ్చిన అయన వేదిక మీద ప్రసంగిస్తూ ఎవరికైనా పార్టీయే సుప్రీం అని, జనంలో లేకపోతె ఎవర్నీ పార్టీ భరించదని టికెట్స్ పార్టీ పెద్దలు ఇస్తారని అన్నారు.
ఓకే.. అయన చెప్పింది నిజమే పార్టీ పెద్దలు టికెట్స్ ఖరారు చేస్తారు. మహా అయితే ఈయన కొన్ని టికెట్స్ కోసం తన సహచరులు.. మిత్రుల కోసం కొన్ని చోట్ల రికమెండ్ చేస్తారేమో కానీ నేరుగా ఈయనే టికెట్స్ ఖరారు చేసి ప్రకటించలేరు.. మరి ఈ ముక్క లోకేష్ కు ముందే తెలియదా.? ఇప్పుడెందుకు ఇలా సుద్దులు చెబుతున్నారు. వాస్తవానికి ఆయన పాదయాత్ర చేస్తూనే దారిలో కొందరు నాయకులను అసెంబ్లీ అభ్యర్థులుగా టికెట్స్ ఖరారు చేసేసారు.
చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అయన యాత్ర చేస్తూనే కొందరిని అభ్యర్థులుగా బహిరంగ సభల్లో పేర్లు చెప్పేసారు. ఐతే రానున్న పరిణామాలు.. మారనున్న రాజకీయ మార్పులు ఇవేమీ గుర్తించకుండా నేరుగా టికెట్స్ ఇచ్చేస్తూ పోవడాన్ని కొందరు సీనియర్ నాయకులు తప్పుబట్టారు.
మహానాడు వేదికపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్#Rajamahendravaram#MahanaduinRajahmundry#Mahanadu2023#NTRCentenaryCelebrations#100YearsOfNTR pic.twitter.com/HKeLrtc4Mg
— Telugu Desam Party (@JaiTDP) May 27, 2023
ఇది చివరకు హై కమాండ్ వరకూ వెళ్ళింది. జనసేనతో పొత్తు కుదిరితే.. వాళ్లకు కొన్ని టికెట్స్ ఇవ్వాల్సి వస్తే ఎలా.? అప్పుడు ఈ అభ్యర్థుల పరిస్థితి ఏమిటి.? ఇవన్నీ ఊహిం చకుండా టికెట్స్ కన్ఫర్మ్ చేయడం పధ్ధతి కాదని నాయకులూ చంద్రబాబు వద్ద చర్చించారు.
లోకేశ్ ప్రకటించిన అభ్యర్థుల్లో పులివర్తి నాని, గాలి భానుప్రకాశ్, పరిటాల శ్రీరామ్, బొజ్జల సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి తదితరులున్నారు. దీంతో లోకేష్ తీరును చంద్రబాబును తప్పుబట్టి ఇక ముందు టికెట్స్ అనౌన్స్ చేయవద్దని గట్టిగా చెప్పారు. దీంతో కర్నూలు .. కడప జిల్లాల్లో ఎక్కడా అభ్యర్థుల ప్రస్తావన చేయకుండానే యాత్ర చేస్తూ వస్తున్నారు.
ఇక నేడు తాజాగా మహానాడులో కూడా లోకేష్ ఆ టికెట్స్ ఘటించి మర్చిపోవాలని చెప్పకనే చెప్పేసారు. కష్టపడాలని, పార్టీ గుర్తిస్తేనే టికెట్ వస్తుందని చెప్పేసారు. అంటే గతంలో అయన పేర్లు చెప్పిన అభ్యర్థులు అంతా వట్టిదే అని తేలిపోయినట్లు అయింది.