Site icon vidhaatha

Lovers | మ‌రో పెళ్లికి సిద్ధ‌మైన ప్రియుడు.. మ‌ర్మాంగాన్ని కోసిన ప్రియురాలు

Lovers | మూడేండ్లుగా ప్రేమించుకుంటున్న ఓ జంట‌.. ముచ్చ‌ట‌గా ఇటీవ‌లే మూడు ముళ్లు, ఏడు అడుగుల బంధంతో ఒక్క‌ట‌య్యారు. కానీ ప్రియుడు మ‌రొక‌రితో మ‌రో పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మ‌వ్వ‌గా, ఆ విష‌యం తెలుసుకుని, అత‌ని మ‌ర్మాంగాన్ని కోసేసింది ప్రియురాలు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో సీఆర్‌పీఎఫ్ జ‌వానుగా విధులు నిర్వ‌ర్తిస్తున్న ఓ వ్య‌క్తి.. త‌న బంధువుల అమ్మాయిని మూడేండ్ల నుంచి ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న ఈ జంట‌.. ఇటీవ‌లే ఎవ‌రికీ తెలియ‌కుండా ర‌హ‌స్యంగా వివాహం చేసుకున్నారు.

అయితే జ‌వాన్ ఈ నెల 23వ తేదీన మ‌రో పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ప్రియురాలికి తెలిసింది. దీంతో ప్రియురాలు తీవ్ర మ‌న‌స్తాపానికి గురైంది. ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం.. ప్రియుడ్ని బీహార్ రాజ‌ధాని పాట్నాలోని ఓ హాట‌ల్‌కు ర‌ప్పించింది.

ఇద్ద‌రూ ఏకాంతంగా ఉన్న స‌మ‌యంలో ప్రియుడి మ‌ర్మాంగాన్ని ప‌దునైన ఆయుధంతో కోసేసింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని నిందితురాలిని అరెస్టు చేశారు. బాధిత వ్య‌క్తిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అత‌ని ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

Exit mobile version