LPG Cylinder Prices | కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.171 తగ్గిన ధర..!

LPG Cylinder Prices | కమర్షియల్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి. 19 కేజీల వాణిజ్య ఎల్​పీజీ సిలిండర్​ ధర రూ.171.50 వరకు చమురు కంపెనీలు తగ్గించాయి. తగ్గిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. అయితే, డొమెస్టిక్‌ గ్యాస్‌ ధరలను మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి. తాజాగా తగ్గించిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్​ ఎల్​పీజీ సిలిండర్​ ధర రూ.1856.50కి చేరింది. కోల్‌కతాలో ధర రూ.1,960.50, ఆర్థిక రాజధాని ముంబయి […]

  • Publish Date - May 1, 2023 / 03:47 AM IST

LPG Cylinder Prices |

కమర్షియల్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి. 19 కేజీల వాణిజ్య ఎల్​పీజీ సిలిండర్​ ధర రూ.171.50 వరకు చమురు కంపెనీలు తగ్గించాయి. తగ్గిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. అయితే, డొమెస్టిక్‌ గ్యాస్‌ ధరలను మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి.

తాజాగా తగ్గించిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్​ ఎల్​పీజీ సిలిండర్​ ధర రూ.1856.50కి చేరింది. కోల్‌కతాలో ధర రూ.1,960.50, ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో రూ.1808కి పడిపోయింది. చెన్నైలో ధర ప్రస్తుతం రూ.2021 తగ్గింది.

వాణిజ్య గ్యాస్​ సిలిండర్​ ధరలను ఈ ఏడాది మార్చ్​ 1న పెంచాయి. యూనిట్​పై రూ.350.50 పెంచాయి. గృహవినియోగ సిలిండర్‌ ధరను రూ.50 పెంచాయి. ఏప్రిల్​లో కమర్షియల్​ సిలిండర్​ ధర రూ.92 వరకు తగ్గింది. ఈ ఏడాదిలో మూడుసార్లు పెరగ్గా.. రెండుసార్లు తగ్గుముఖం పట్టాయి.

Latest News