Site icon vidhaatha

Rules Changed | స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్‌..! మే 1 నుంచి ఆ కాల్స్‌ నుంచి ఉపశమనం..!

Rules Changed |

స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు ట్రాయ్‌ గుడ్‌న్యూస్‌ చెస్పింది. మే నుంచి కొత్త నిబంధనలు అమలులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. దాంతో స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు ఊరట కలుగనున్నది. ఫేక్‌, ప్రమోషనల్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ల బారి నుంచి విముక్తి లభించనున్నది.

ఇందుకోసం ట్రాయ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సహాయం తీసుకోనున్నది. దాంతో యూజర్లకు అస్తమానం చికాకు కలిగించే కాల్స్‌, సందేశాల తిప్పలు తప్పనున్నాయి. ఈ మేరకు స్పామ్‌ కాల్స్‌ బారి నుంచి యూజర్లను రక్షించేందుకు టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ ఆదేశాలు సమాచారం.

ఎయిర్‌టెల్‌, జియో తదితర సంస్థలను తప్పనిసరిగా ఏఐ ఫిల్టర్‌ను వినియోగించాలని ఆదేశించింది. దాంతో ప్రమోషనల్‌, ఫేక్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ల నుంచి బయటపడొచ్చు. అయితే, ట్రాయ్‌ ఆదేశాలపై జియో, ఎయిర్‌టెల్‌ స్పందిస్తూ.. త్వరలోనే నెట్‌వర్క్‌లలో ఏఐ ఫిల్టర్‌ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేయనున్నట్లు వెల్లడించాయి.

అయితే, ఆ ఆప్షన్‌ మే ఒకటి నుంచి వినియోగించుకునే అవకాశం ఉందని తెలుస్తున్నది. టెక్నాలజీ వినియోగం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అవగాహన లోపంతో స్పామ్‌ కాల్స్‌, మెస్సేజ్‌లతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

వీటిని అరికట్టేందుకు కొంతకాలంగా ట్రాయ్‌ ప్రయత్నిస్తున్నది. సైబర్‌ నేరగాళ్లు ఫేక్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లతో అకౌంట్ల నుంచి సొత్తును ఊడ్చేస్తున్నారు. సైబర్‌ నేరాలపై కన్నేసిన ట్రాయ్‌.. కాల్‌ ఐడీని అందుబాటులోకి తీసుకువచ్చేలా కంపెనీలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ కాల్‌ ఐడీ ఆప్షన్‌తో ఇకపై ఫోన్‌ చేసే వారి పేర్లు, ఫొటోలు మొబైల్‌ ఫోన్లలో డిస్లే కానున్నాయి. ఈ విధానంతో మనకు ఫోన్‌ చేసేది ఎవరో ముందుగానే తెలిసిపోతుంది.

తద్వారా జాగ్రత్త పడవచ్చని ట్రాయ్‌ భావిస్తున్నది. అయితే, ప్రైవసీ సమస్యల కారణంగా ఎయిర్‌టెల్‌, జియో తదితర కంపెనీలు ఈ టెక్నాలజీని తీసుకువచ్చేందుకు వెనుకాడుతున్నాయి. ఈ విషయంలో కంపెనీలు వెనుకాడుతుండడంతో ఒకటి నుంచి మార్గదర్శకాలను అమలు చేస్తాయా? లేదా? అనేది సందేహాస్పదంగా మారింది.

Exit mobile version