New Degree and PG Courses | తెలంగాణ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. డిగ్రీ, పీజీలో కొత్త కోర్సులు

New Degree and PG Courses | ప్రపంచవ్యాప్తంగా కొత్తగా వస్తున్న మార్పులు, పరిశ్రమల అవసరాలు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని కొత్త కోర్సులను తీసుకొస్తున్నారు. ఈ నేప‌థ్యంలో 2026-27 విద్యా సంవ‌త్స‌రానికి కొత్త కోర్సుల‌ను ప్ర‌వేశ‌పెట్టేందుకు ఉన్న‌త విద్యామండ‌లి సిద్ద‌మైంది.

New Degree and PG Courses | తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ కొత్త పుంత‌లు తొక్కుతోంది. ఇప్ప‌టికే ఉన్న డిగ్రీ, పీజీ కోర్సుల( New Degree and PG Courses ) జాబితాలో మ‌రిన్ని కొత్త కోర్సులు చేర‌నున్నాయి. భ‌విష్య‌త్‌ను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థుల‌ను సాంకేతిక యుగానికి, మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి సంక‌ల్పించింది. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా వస్తున్న మార్పులు, పరిశ్రమల అవసరాలు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని కొత్త కోర్సులను తీసుకొస్తున్నారు. ఈ నేప‌థ్యంలో 2026-27 విద్యా సంవ‌త్స‌రానికి కొత్త కోర్సుల‌ను ప్ర‌వేశ‌పెట్టేందుకు ఉన్న‌త విద్యామండ‌లి సిద్ద‌మైంది.

ఈ సంద‌ర్భంగా ఉన్న‌త విద్యా మండ‌లి చైర్మ‌న్ వి బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. కృత్రిమ మేధ, సైబర్‌ సెక్యూరిటీ, ఫిన్‌టెక్, డిఫెన్స్, ఏవియేషన్, టూరిజం, హెల్త్‌కేర్, బయోమెడికల్, మారిటైమ్‌ తదితర రంగాల్లో ఈ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ కళాశాలలు, యూనివర్సిటీలో కొత్తగా ప్రవేశపెట్టే ఈ కోర్సుల వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు.

డిగ్రీలో కొత్త కోర్సులు ఇవే..

బీఏ- డిఫెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ స్టడీస్‌
బీఏ- ల్యాండ్‌, అగ్రికల్చర్‌ & రూరల్‌ డెవలప్‌మెంట్‌
బీబీఏ- హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ & హెల్త్‌ మేనేజ్‌మెంట్‌
బీబీఏ- ఎయిర్‌పోర్ట్‌, ఎయిర్‌లైన్‌, ఎయిర్‌స్పేస్‌ & ఎయిర్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌
బీబీఏ – మారిటైం టెక్నాలజీ, కామర్స్‌ & మేనేజ్‌మెంట్‌
బీబీఏ- ఫుడ్‌ టెక్నాలజీ, ఫుడ్‌ సెక్యూరిటీ & మేనేజ్‌మెంట్‌
బీబీఏ- ట్రావెల్‌, టూరిజం & హాస్పిటాలటీ మేనేజ్‌మెంట్‌
బీకాం – ఫైనాన్స్‌ టెక్నాలజీ (ఫిన్‌టెక్‌)
బీకాం- ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ & అకౌంట్స్‌
బీకాం- ఈ- కామర్స్‌, ఎం-కామర్స్‌ & డిజిటల్‌ మార్కెటింగ్‌
బీఎస్సీ – డేటా సైన్స్‌& ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌
బీఎస్సీ- క్లైమెట్‌ సైన్స్‌ & ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌
బీఎస్సీ – ఇన్‌స్ట్రుమెంటేషన్‌ (ఆనర్స్‌)- 4 ఏళ్లు
బీఎస్సీ – బయో ఇన్ఫార్మేటిక్స్‌ (ఆనర్స్‌) -4 ఏళ్లు
బీఎస్సీ – మెడికల్‌ మైక్రో బయాలజీ (ఆనర్స్‌) – 4 ఏళ్లు
బీఎస్సీ – బయో టెక్నాలజీ, కెమిస్ట్రీ, జెనెటిక్స్‌, బోటనీ/మైక్రో బయాలజీ/జువాలజీ/బయో కెమిస్ట్రీ/కెమిస్ట్రీ/న్యూట్రిషన్‌ & డైటిక్స్‌/ఫుడ్‌ సైన్స్‌ (ఏవైనా మూడు సబ్జెక్టులు)
బీఎస్సీ- కంప్యూటర్‌ సైన్స్‌ & సైబర్‌ సెక్యూరిటీ/ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌/రోబోటిక్స్/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్‌/డేటా సైన్స్‌ (మూడు సబ్జెక్టులు)

పీజీలో కొత్త కోర్సులు ఇవీ..

ఎంఏ- అడ్వాన్స్‌ డిఫెన్స్‌ & సెక్యూరిటీ స్టడీస్‌
ఎంఏ – ల్యాండ్‌ గవర్నెన్స్‌, అగ్రికల్చర్‌ & రూరల్‌ డెవలప్‌మెంట్‌
ఎంఏ- అడ్వాన్స్‌ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ & హెల్త్‌ మేనేజ్‌మెంట్‌
ఎంఏ- మారిటైం టెక్నాలజీ & మారిటైం గవర్నెన్స్‌
ఎంఏ- ట్రావెల్‌, టూరిజం & హాస్పిటాలటీ మేనేజ్‌మెంట్‌
ఎంఏ- అడ్వాన్స్‌ ఎయిర్‌పోర్టు, ఎయిర్‌లైన్‌, ఎయిర్‌ స్పేస్‌ & ఎయిర్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌
ఎంకాం: ఫైనాన్స్ టెక్నాలజీ (ఫిన్‌టెక్‌) & ఎమర్జింగ్‌ ఛాలెంజెస్‌
ఎమ్మెస్సీ- క్లైమెట్‌ సైన్స్‌ & ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌
ఎమ్మెస్సీ – మెడికల్‌ మైక్రో బయాలజీ
ఎమ్మెస్సీ – మెడికల్‌ ఇమ్యునాలజీ
ఎమ్మెస్సీ- సైబర్ సెక్యూరిటీ

Latest News