Site icon vidhaatha

Narayanapeta: ఎస్సీ కులధ్రువ పత్రాలు ఇవ్వండి: మాదాసి కురువల నిరసన

విధాత‌: మాదాసి /మాదారి కురువలు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాల సాధనకై నిరసన దీక్ష కార్యక్రమం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో చేపట్టారు. మక్తల్ పట్టణంలో చేపట్టిన మాదాసి కరువల నిరసన దీక్షలో భాగంగా స్థానిక నల్లజానమ్మ దేవాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభా స్థలం దగ్గర నిరసన దీక్ష చేపట్టారు.

కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కురువ విజయ్ కుమార్ మాట్లాడుతూ మాదాసి కురువ కుల పత్రాలు వెంటనే జారీ చేయాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు. పాలమూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు, MPలు మాదాసి కురువ కుల పత్రాల జారీ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారో తెలపాలని కోరారు.

తమకు న్యాయం జరగాలంటు తాహ‌సీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. తమ మాదాసి కురువలకు ఎస్సి కుల ధ్రువపత్రాలు మంజూరు చేయ‌డానికి సహకరించనిచో రాబోయే ఎన్నికల్లో తమ ఓట్లతోనే రాజకీయ నాయకులకు తగిన బుద్ధి చెబుతామని ఘాటుగా స్పందించారు.

కార్యక్రమంలో మాదాసి కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయకుమార్ తో పాటు మాదాసి కురువ సంఘం సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version