Warangal | ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టరెట్ వద్ద కాంగ్రెస్ ధర్నా

Warangal విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రైతులు పండించిన ధాన్యం వెంటనే కొనుగొలు చేయాలని వరంగల్(Warangal) జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ ముందు సోమవారం ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. తడిసిన ధాన్యం కొనాలని, రైతులకు నష్టపరిహరం ఇవ్వాలని, రైతులకు పంటపై భరోసా కలిపించాలని, తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా రైతుల బతుకు ఆగమ్య గోచరంగా మారిందని ఆవేదన […]

  • Publish Date - May 15, 2023 / 03:29 AM IST

Warangal

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రైతులు పండించిన ధాన్యం వెంటనే కొనుగొలు చేయాలని వరంగల్(Warangal) జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ ముందు సోమవారం ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు.

తడిసిన ధాన్యం కొనాలని, రైతులకు నష్టపరిహరం ఇవ్వాలని, రైతులకు పంటపై భరోసా కలిపించాలని,
తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా రైతుల బతుకు ఆగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గిట్టుబాటు ధరలు లేని కారణంగా రైతులు ఎన్నో అశలతో పండించిన పంటను అమ్ముకొలేక, వర్షాల నుండి కాపాడుకొలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ నాయకులు మహ్మద్ అయూబ్, జన్ను రవి, జన్ను అదాం, గిన్నారం రాజు, జన్ను జీవన్, ప్రతాప్ వేణు, షేక్ పాష, తజమ్ముల్, సారంగం, కార్తీకేయ, బండి సంతోష్, సాబీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Latest News