మ‌ద్యం మ‌త్తులో బ‌ట్ట‌లు విప్పేసి.. హాస్పిట‌ల్‌లో తిరిగిన డాక్ట‌ర్

అత‌నో డాక్ట‌ర్.. రోగుల‌కు వైద్యం చేయాల్సింది పోయి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు. పీక‌ల దాకా మ‌ద్యం సేవించి ఆస్ప‌త్రికి వ‌చ్చిన ఆ డాక్ట‌ర్ బ‌ట్ట‌లు విప్పేసి తిరిగారు

  • Publish Date - March 10, 2024 / 10:15 AM IST

అత‌నో డాక్ట‌ర్.. రోగుల‌కు వైద్యం చేయాల్సింది పోయి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు. పీక‌ల దాకా మ‌ద్యం సేవించి ఆస్ప‌త్రికి వ‌చ్చిన ఆ డాక్ట‌ర్ బ‌ట్ట‌లు విప్పేసి తిరిగారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని ఛ‌త్ర‌ప‌తి శంభాజీన‌గ‌ర్ జిల్లా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఛ‌త్ర‌ప‌తి శంభాజీన‌గ‌ర్ జిల్లా ఆస్ప‌త్రిలో ప‌ని చేసే ఓ డాక్ట‌ర్ డ్ర‌గ్స్‌కు బానిస అయ్యారు. మ‌ద్యం కూడా సేవించేవారు. అయితే ఇటీవలే ఆయ‌న పీక‌ల దాకా మ‌ద్యం సేవించి ఆస్ప‌త్రికి వ‌చ్చారు. ఆ త‌ర్వాత వాష్‌రూమ్‌కు వెళ్లిన అత‌ను.. బ‌ట్ట‌లు విప్పి బ‌య‌ట‌కు వ‌చ్చారు. అనంత‌రం ఆస్ప‌త్రిలో బ‌ట్ట‌ల్లేకుండానే తిరిగారు. ఈ దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ఈ ఘ‌ట‌న‌పై జిల్లా ఆస్ప‌త్రి హెడ్ డాక్ట‌ర్ ద‌యానంద్ మోతిపావ్లే సీరియ‌స్‌గా స్పందించారు. డాక్ట‌ర్‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. బ‌ట్ట‌లు లేకుండా ఆస్ప‌త్రిలో తిరిగిన డాక్ట‌ర్‌ను చూసి అక్క‌డ ప‌ని చేసేవారితో పాటు రోగులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యారు.