Mahbubnagar | జర్నలిస్టుల సంక్షేమానికి ఎళ్ల వేళలా సహకారం: కలెక్టర్ క్రాంతి

Mahbubnagar విధాత, మహబూబ్‌నగర్‌: జర్నలిస్టుల సంక్షేమానికి తన నుండి ఏళ్ల వేళలా సహకారం ఉంటుందని జోగులంబా గద్వాల్ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సోమవారం గద్వాల పట్టణంలో జరిగిన జిల్లా ద్వితీయ మహాసభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన సుమారు 300మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాల విషయంలో జిల్లాలోని శాసన సభ్యులతో చర్చించి, వారి సహకారంతో తగు చర్యలు చేపడతామని ఆమె […]

  • Publish Date - May 8, 2023 / 04:51 PM IST

Mahbubnagar

విధాత, మహబూబ్‌నగర్‌: జర్నలిస్టుల సంక్షేమానికి తన నుండి ఏళ్ల వేళలా సహకారం ఉంటుందని జోగులంబా గద్వాల్ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సోమవారం గద్వాల పట్టణంలో జరిగిన జిల్లా ద్వితీయ మహాసభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన సుమారు 300మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

జర్నలిస్టులకు ఇంటి స్థలాల విషయంలో జిల్లాలోని శాసన సభ్యులతో చర్చించి, వారి సహకారంతో తగు చర్యలు చేపడతామని ఆమె భరోసా ఇచ్చారు. జిల్లాలో జర్నలిస్టుల నుండి తమకు ఎలాంటి సమస్యలు లేవని, జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమ కార్యక్రమాల అమలును వార్తల రూపంలో తమకు వారి నుండి ఎంతో సహాయ సహకారాలు అందుతున్నట్లు వల్లూరు క్రాంతి కితాబునిచ్చారు. ఘనంగా జిల్లా మహాసభను నిర్వహించిన టీయూడబ్ల్యూజే జిల్లా శాఖకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ మాట్లాడుతూ, పత్రికా స్వేచ్ఛ, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం తమ సంఘం నిరంతరం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్నందువల్లే రాష్ట్రంలో వేలాది మంది జర్నలిస్టుల ఆదరాభిమానాలు చూరగొనగలుగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

దేశంలో ఐజేయూ, రాష్ట్రంలో టీయుడబ్ల్యుజె సంఘాలు మాత్రమే జర్నలిస్టుల విశ్వాసం, వారి గుండెల్లో స్థానం సంపాదించాయని విరాహత్ తెలిపారు. నిరంతరం ఆయా కార్యక్రమాలతో సంఘాన్ని మరింత పటిష్టం చేసేందుకు కృషి చేయాలని జిల్లా శాఖను ఆయన సూచించారు. ఇంకా ఈ సభలో గద్వాల్ డిఎస్పీ రంగరాజు, టీయుడబ్ల్యుజె రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్, వనపర్తి, మహబూబ్ నగర్, గద్వాల్ జిల్లాల అధ్యక్షులు మధుగౌడ్, దత్తెందర్, శ్యామ్ లతో పాటు జిల్లా నలుమూలల నుండి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఏకగ్రీవంగా జిల్లా కమిటీ ఎన్నిక

అధ్యక్షులుగా వెలుగు జిల్లా ప్రతినిధి రవీందర్ రెడ్డి, కార్యదర్శిగా సాక్షి జిల్లా ప్రతినిధి రామకృష్ణ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఆంధ్రప్రభ జిల్లా ప్రతినిధి మధు, వార్తా జిల్లా ప్రతినిధి వెంకటేష్, మద్దిలేటి, దౌలత్ ఎన్నికయ్యారు.

సహాయ కార్యదర్శులుగా మున్సీఫ్ టీవీ జిల్లా ప్రతినిధి వరప్రసాద్, మన తెలంగాణ జిల్లా ప్రతినిధి ముస్తఫా, గద్వాల్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ నాగేశ్వర్ రెడ్డి, కోశాధికారిగా చుక్క సుదర్శన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు 12మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

ఈ ఎన్నికకు పరిశీలకులుగా యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్ వ్యవహరించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ సమక్షంలో జోగులంబా గద్వాల్ జిల్లా కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అన్ని పత్రికలు, అన్ని ప్రాంతాల జర్నలిస్టులకు కమిటీలో చోటు దక్కడం గమనార్హమని యూనియన్‌ నాయకులు తెలిపారు.

Latest News