Viral Video| రద్దీగా ఉన్న ఓ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధుడిని బస్సు ఢీకొట్టింది. దీంతో ఆ వృద్ధుడు బస్సు కింద పడిపోయాడు. కానీ డ్రైవర్ గమనించకుండా బస్సును వేగంగా ముందుకు తీసు కెళ్లాడు. ఇతర వాహనదారులు అప్రమత్తమై కేకలు వేయడంతో బస్సును డ్రైవర్ ఆపాడు. వృద్ధుడు చనిపోయాడా? బతికాడా? అని స్థానికులు ఊపిరి బిగబట్టి చూశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని పోవాయి ఏరియాలోని ఓ రోడ్డుపై మంగళవారం మధ్యాహ్నం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే ఓ వృద్ధుడు రోడ్డు దాటేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఓ బస్సు ముందు నుంచి ఆ ముసలాయన రోడ్డు దాటేందుకు యత్నించగా, అది ఢీకొట్టింది. దీంతో వృద్ధుడు బస్సు కింద పడిపోయాడు.
డ్రైవర్ గమనించకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు. అక్కడున్న వాహనదారులు, పాదాచారులు గట్టిగా అరవడంతో బస్సును డ్రైవర్ నిలిపివేశాడు. వృద్ధుడు చనిపోయాడా? బతికాడా? అని అందరూ ఊపిరి బిగబట్టి చూశారు. మొత్తానికి వృద్ధుడు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు.