Margadarshi Case
విధాత: రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి కేసును మరింత లోతుగా తవ్వుకెళుతున్నారు. ఎంత వీలయితే అంతవరకూ రామోజీని బదనాం చేస్తూ… మార్గదర్శి అక్రమాలను వెలికితీయడమే లక్ష్యంగా అయన ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో రామోజీ ఒకానొక సందర్భంలో అక్రమంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరిస్తున్నందుకు పోలీస్ స్టేషన్లో కూడా ఉన్నారన్న విషయాన్నీ బయటపెట్టారు.
వాస్తవానికి రామోజీ… ఉండవల్లి మధ్య వైఎస్సార్ కాలంలో మొదలైన వివాదం ఆ తరువాత కొన్నాళ్ళు మూలానపడినా మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంప్లిడ్ కావడం, ఉండవల్లి లేవనెత్తుతున్న అంశాలు ప్రజల్లో చర్చకు దారి తీస్తుండడంతో రామోజీరావు డిఫెన్స్ లో పడ్డారు. అందుకే ఆమధ్య కొంతమంది ఆడిటర్లు, టిడిపి నాయకులూ, లాయర్లతో సదస్సు నిర్వహిస్తూ మార్గదర్శికి నైతిక మద్దతు పొందేందుకు ప్రయత్నించారు.
టిడిపి నాయకులతో స్టేట్మెంట్స్ కూడా ఇప్పిస్తూ వాటిని ఈనాడులో కవర్ చేస్తూ వచ్చారు. దానికి ప్రతిగా ఉండవల్లి అరుణ్ కుమార్ నిన్న విశాఖలో మరో పోటీ సదస్సులాంటిది పెట్టి అసలు రామోజీ అక్రమాలు.. మార్గదర్శి ఎలా నిబంధనలు ఉల్లంఘిస్తుందో వివరిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించారు. రాష్ట్రంలో, ఇంకా బెంగాల్లో శారదా చిట్ ఫండ్ వంటివి మూసేసినపుడు ప్రభుత్వాలు ఏమి చేయలేకపోయాయి.
అయితే ఇప్పుడు మార్గదర్శి కూడా ఎత్తిపోతే … డిపాజిటర్లకు డబ్బులు ఇవ్వలేకపోతే ఎవరు సమాధానం చెబుతారన్నది రామోజీ ప్రశ్న.. ఇప్పుడు అయన ఏమన్నారంటే గతంలో రామోజీ నిబంధనలు, రిజిస్ట్రేషన్ లేకుండానే మార్గదర్శి పేరిట డిపాజిట్లు వసూళ్లు చేస్తే పోలీస్ స్టేషన్లో నాలుగు రోజులు ఉంచారన్న విషయాన్నీ తెలియజేస్తూ ఆ తరువాతనే కంపెనీని రిజిష్టర్ చేసారని చెప్పారు.. మొత్తానికి రామోజీని పోలీస్ స్టేషన్లో ఉంచిన విషయం ఎవరికీ తెలియదు కానీ ఉండవల్లి పుణ్యాన బయటకు వచ్చింది.