Mayor Vijayalakshmi | సీఎం రేవంత్‌రెడ్డితో మేయర్‌ విజయలక్ష్మి భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం‌ను కోరారు

Mayor Vijayalakshmi | విధాత : సీఎం రేవంత్ రెడ్డితో మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం‌ను కోరారు. కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోవడంతో ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు హైకోర్టుకు వెళ్ళినట్లు సీఎం దృష్టికి మేయర్ తీసుకెళ్లారు.


కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించేలా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని మేయర్ విజయలక్ష్మి కోరారు. స్టాండింగ్ కమిటీ ఏర్పాటు, కౌన్సిల్ సమావేశం, బల్దియా ఆర్థిక పరిస్థితిపై రేవంత్‌తో చర్చించారు. కాగా బీఆరెస్‌ పార్టీ సెక్రటరీ జనరల్‌, ఎంపీ కేశవరావు కూతురైన మేయర్‌ విజయలక్ష్మి సీఎంతో భేటీ కావడం రాజకీయంగా హాట్‌ టాపిక్‌ గా మారింది.

Latest News