Site icon vidhaatha

KTR | అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. మ‌రోసారి గెలిపించాల‌ని అభ్య‌ర్థ‌న‌

KTR | తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు మీ ద‌య‌తో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను.. త్వ‌రలో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోసారి గెలిపించాల‌ని కేటీఆర్ అభ్య‌ర్థించారు.

రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన పంద్రాగ‌స్టు వేడుక‌ల్లో కేటీఆర్ పాల్గొన్నారు. అనంత‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించి.. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. తంగ‌ళ్ల‌ప‌ల్లి మండ‌లం సారంప‌ల్లిలో కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఇప్పటి వరకు మీ దయతోనే నాలుగు సార్లు గెలిచానని.. మరోసారి గెలిపిస్తే మరిన్ని మంచి పనులు చేస్తా అని హామీ ఇచ్చారు. కడుపులో పెట్టుకొని చూసుకోండి అని కోరారు. తనను గెలిపిస్తే ఓ అన్నగా, తమ్మునిగా మంచి పనులు చేస్తానన్నారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతుంద‌ని మంత్రి పేర్కొన్నారు. ఈ స‌మ‌యంలో రాష్ట్రాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్, బీజేపీ నాయ‌కుల చేతిలో పెట్టి ఆగం కావొద్దంటూ కేటీఆర్ సూచించారు. తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను కేంద్రం కాపీ కొడుతుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.
తెలంగాణ ఆచరిస్తే.. దేశం అనుసరిస్తోందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం రైతు బంధు ప్రవేశపెడితే.. కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ పేరిట అలాంటి పథకాన్నే కేంద్రంలోని బీజేపీ సర్కారు అమలు చేస్తోందని తెలిపారు. ఇక్కడ మిషన్ భగీరథ తీసుకువస్తే.. కేంద్రం హర్ ఘర్ జల్ అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు.

Exit mobile version