నాడు మ‌న్మోహ‌న్‌ను.. నేడు మోదీని అడిగాం.. కేటీఆర్ ట్వీట్

OBC| విధాత: ఓబీసీకి కేంద్రంలో ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల‌ని కోరుతూ టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 2004, డిసెంబ‌ర్ 18 నాటి చిత్రాల‌ను కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు. కేసీఆర్ నేతృత్వంలో ఓబీసీ నాయ‌కుల‌ను నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌ను క‌లిసి ఓబీసీల‌కు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల‌ని అభ్య‌ర్థించారు. దుర‌దృష్టవ‌శాత్తు నాటి యూపీఏ ప్ర‌భుత్వం ఓబీసీల సంక్షేమాన్ని ప‌ట్టించుకోలేద‌ని […]

  • Publish Date - November 18, 2022 / 05:49 AM IST

OBC| విధాత: ఓబీసీకి కేంద్రంలో ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల‌ని కోరుతూ టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 2004, డిసెంబ‌ర్ 18 నాటి చిత్రాల‌ను కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు.

కేసీఆర్ నేతృత్వంలో ఓబీసీ నాయ‌కుల‌ను నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌ను క‌లిసి ఓబీసీల‌కు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల‌ని అభ్య‌ర్థించారు. దుర‌దృష్టవ‌శాత్తు నాటి యూపీఏ ప్ర‌భుత్వం ఓబీసీల సంక్షేమాన్ని ప‌ట్టించుకోలేద‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఓబీసీల పట్ల సానుకూలంగా స్పందించాల‌ని, ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల‌ని ప్ర‌ధాని మోదీకి ఎన్నోసార్లు అభ్య‌ర్థించాము. ఇప్ప‌టికే ఓబీసీల‌కు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, వ‌చ్చే బ‌డ్జెట్‌(2023) లోనైనా నిధులు కేటాయిస్తార‌ని ఆశిస్తున్న‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

Latest News