Site icon vidhaatha

Minister Niranjan Reddy | రైతుబంధు సంపూర్ణం.. 11 విడతల్లో రైతుల ఖాతాల్లోకి రూ. 7624.74 కోట్లు: మంత్రి నిరంజన్ రెడ్డి

Minister Niranjan Reddy |

విధాత, హైదరాబాద్‌: ఈ వర్షాకాలంలో రాష్ట్ర ప్రభుత్వం 11 విడతలుగా రైతు బంధు డబ్బులు రూ.7624.74 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. 68.99 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాలకు రైతు బంధు డబ్బులు పంపిణీ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 5 లక్షల 8756 మంది రైతులకు రూ.609.67 కోట్లు, అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 35,879 మంది రైతులకు రూ.33.60 కోట్లు రైతు బంధు ఇచ్చినట్లు వెల్లడించారు.

తెలంగాణలో రైతును రాజును చేయాలన్న సంకల్పంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. స్వంతంత్ర భారత చరిత్రలో ఇది ఒక రికార్డని అన్నారు. రాష్ట్ర రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

ఈనెల 27న అమెరికాకు మంత్రి నిరంజన్‌రెడ్డి

ఈ నెల 27 నుంచి సెప్టెంబరు 3 వరకు అమెరికాలో వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం పర్యటించనున్నది. 29 నుంచి 31 వరకు ఇల్లినాయిస్ రాష్ట్రంలో జరిగే ప్రతిష్టాత్మక ఫార్మ్ ప్రోగ్రెస్ షో కు హాజరవుతారని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మంత్రి బృందం అమెరికా పర్యటనకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Exit mobile version