MLA Muthireddy |
- పౌరుషాల గడ్డ జనగామ
- ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫైర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి భేషరతుగా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి డిమాండ్ చేశారు. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చడమేంటంటూ నిప్పులు చెరిగారు.
మొన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తన స్వగ్రామంలో కార్యకర్తలతో మాట్లాడుతూ ఇతర పార్టీలలో ఉంటూ కుక్కల్లా మొరిగే వారిని మన పార్టీలో చేర్చి పిల్లులుగా మార్చారని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పల్లా వ్యాఖ్యలపైన ముత్తిరెడ్డి ఫైరయ్యారు.
జనగామలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉద్యమాల చరిత్ర ఉన్న వారిని కొనుగోలు చేసి మలినం చేయొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ గడ్డ పౌరుషాలకు అడ్డా అంటూ ఆయన ఈ ప్రాంత విశిష్టతను కొనియాడారు.
గతంలో సీఎం అభ్యర్థిని ఓడించిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందన్నారు. డబ్బుతో ప్రజా ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. సీఎం కేసీఆర్ కు మంచి ఏంటిదో? చెడేంటిదో తెలుసని, ఆయన మాట శిరోధార్యమని అన్నారు. కేసీఆర్ మాటకు కట్టుబడి ఉంటానని ప్రకటించారు.