Site icon vidhaatha

గుడి ఎనకాల కథ ఇదా..!

మనోజ్ పెళ్లి కోసమే మోహన్ బాబు చంద్రబాబును కలిశారా!

ఉన్న‌మాట: సాయిబాబా ఆలయం ప్రతిష్ట పేరిట ఈమధ్య చంద్రబాబును మోహన్ బాబు అండ్ సన్స్ కలిశారు. కట్ చేస్తే నెలరోజుల్లో టిడిపి నాయకురాలితో మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ కు పెళ్లి కుదిరేలా కనిపిస్తోంది. అంటే మొన్నామధ్య చంద్రబాబు. మోహన్ బాబు కలిసింది ఈ పెళ్లి గురించి మాట్లాడేందుకెనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఆదివారం రాత్రి సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండి డివిజన్ లో ఏర్పాటు చేసిన వినాయక మండపానికి భూమా మౌనిక, మంచు మనోజ్ హాజరై పూజలు చేయడంతో వారిద్దరూ ఒకటవ్వబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయ్. నిజానికి ఈ పెళ్లికి సంబంధించి గడిచిన కొంతకాలంగా రెండు కుటుంబాల మధ్య చర్చ జరుగుతుందన్న మాట వినిపిస్తోంది.

ఈ మధ్యన టీడీపీ అధినేత చంద్రబాబును మనోజ్ తండ్రి నటుడు మోహన్ బాబు కలిసింది కూడా అందుకే అని అంటున్నారు. భూమా మౌనికతో కలిసి గణేశ్ మండపానికి వచ్చిన మనోజ్ ను మీడియా ప్రతినిధులు పెళ్లి గురించి అడగ్గా.. త్వరలో ప్రకటన చేస్తానని వ్యాఖ్యానించారే తప్పించి.. మౌనిక గురించి ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. 2015లో మంచు మనోజ్- ప్రణతీ రెడ్డిల వివాహం జరిగిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత వారు 2019లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత నుంచి మంచు మనోజ్‌ రెండో పెళ్లి అంటూ చాలాసార్లు వార్తలు వచ్చాయ్. అయితే ఇప్పుడు భూమా మౌనికారెడ్డితో మంచు మనోజ్‌ గణేశ్‌ మండపాన్ని దర్శించుకోవడం అటు రాజకీయంగా, ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ హాట్‌ టాపిక్‌ గా మారింది. ప్రస్తుతం మనోజ్ అహం బ్రహ్మాస్మీ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version