Heavy Floods | ఉత్త‌రాదిన దంచి కొడుతున్న వాన‌లు.. ఏడుగురి మృతి

Heavy Floods | సాహసం చేసి మ‌హిళ‌ను ర‌క్షించిన హ‌రియాణా యువ‌కులు విధాత‌: ఎన్న‌డూ లేని స్థాయిలో వ‌డ‌గాలుల‌తో ఉక్కిరిబిక్కిరైన ఉత్త‌రాది రాష్ట్రాల్లో వ‌ర్షాలు దంచి కొడుతున్నాయి. ఆదివారం కురిసిన భారీ వ‌ర్షాల‌కు వివిధ ప్రాంతాల్లో సుమారు ఏడుగురు మృతి చెందారు. భారీ ఉరుములు, మెరుపుల‌తో కూడిన వాన‌ల‌కు హిమాచల్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, ప‌శ్చిమ ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ల‌లో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు, మ‌ట్టి పెళ్లలు విరిగిప‌డ‌టం వంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. హిమాచ‌ల్‌లో అక‌స్మాత్తుగా ముంచుకొచ్చిన వ‌ర‌ద సుమారు 12 […]

  • Publish Date - June 26, 2023 / 08:11 AM IST

Heavy Floods |

  • సాహసం చేసి మ‌హిళ‌ను ర‌క్షించిన హ‌రియాణా యువ‌కులు

విధాత‌: ఎన్న‌డూ లేని స్థాయిలో వ‌డ‌గాలుల‌తో ఉక్కిరిబిక్కిరైన ఉత్త‌రాది రాష్ట్రాల్లో వ‌ర్షాలు దంచి కొడుతున్నాయి. ఆదివారం కురిసిన భారీ వ‌ర్షాల‌కు వివిధ ప్రాంతాల్లో సుమారు ఏడుగురు మృతి చెందారు.

భారీ ఉరుములు, మెరుపుల‌తో కూడిన వాన‌ల‌కు హిమాచల్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, ప‌శ్చిమ ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ల‌లో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు, మ‌ట్టి పెళ్లలు విరిగిప‌డ‌టం వంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. హిమాచ‌ల్‌లో అక‌స్మాత్తుగా ముంచుకొచ్చిన వ‌ర‌ద సుమారు 12 వాహ‌నాల‌ను త‌న‌తో తీసుకుపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ఎక్క‌డిక‌క్క‌డ న‌దులు పొంగి పొర్లుతుండ‌టంతో రాష్ట్రంలో 100కు పైగా రోడ్ల‌ను మూసివేశారు. ఉత్త‌రాఖండ్‌లోని ఉత్త‌ర్‌కాశీ జిల్లాలో పిడుగు పాటు (Thunderbolt)కు ఒక యువ‌కుడు (20) మ‌ర‌ణించ‌గా ముగ్గురు గాయ‌ప‌డ్డారు. బాగేశ్వ‌ర్‌లో 400 మేక‌లు మృత్యువాత ప‌డ్డాయి. గౌరీకుండ్‌, సోన్‌ప్ర‌యాగ్ మ‌ధ్య స‌ర్వీస్ చేసే కారుపై పెద్ద రాయి దొర్లుకుంటూ వ‌చ్చి ప‌డ‌టంతో వాహ‌నం నుజ్జునుజ్జు అయిపోయింది.

ఈ ఘ‌ట‌న‌లో డ్రైవ‌ర్ అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించాడు. ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా ఉండ‌టంతో కేదార్‌నాథ్ (Kedarnath) యాత్ర‌ను కొద్దిసేపు అధికారులు నిలిపివేశారు. ఇళ్ల‌లోకి వ‌ర‌ద ముంచెత్తే స్థాయిలో హ‌రిద్వార్‌లో వాన‌లు కురుస్తున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో వ‌ర్షానికి ఒక పూరిపాక కూలిపోవ‌డంతో ఇద్ద‌రు బాలురు స‌జీవ స‌మాధి అయ్యారు కుటుంబంలోని మ‌రో ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

హ‌రియాణాలో స్థానికుల సాహ‌సం

హ‌రియాణా (Haryana) లోని పంచ‌కుల స్థానికులు సాహ‌సం చేసి ఒక మ‌హిళ ప్రాణాలు కాపాడారు. ఇక్క‌డి గుడికి వ‌చ్చిన యువ‌తి.. ద‌ర్శ‌నం ముగించుకు వ‌చ్చి కారులో కూర్చున్నారు. ప‌క్క‌నే ఉన్న క‌ట్ట‌లు దాటుకుని అప్ప‌టిక‌ప్పుడు వ‌చ్చేయ‌డంతో.. కారును వ‌ర‌ద లాక్కుపోయింది. గ‌మ‌నించిన స్థానికులు తాడు సాయంతో ఆమెను ర‌క్షించారు. ఈ వీడియో దేశ‌వ్యాప్తంగా వైర‌ల్ అయింది.

Latest News