విధాత: ప్రఖ్యాత ఆధ్యాత్మిక యాత్ర ‘చార్ ధామ్’ ప్రారంభమైంది. అక్షయ తృతీయను పురస్కరించుకొని బుధవారం ఉత్తరాఖండ్ ఉత్తర కాశీలోని గంగోత్రి, యమునోత్రి ధామ్‌ల తలుపులు తెరవడంతో చార్ ధామ్ యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. గంగోత్రి ధామ్ తలుపులు ఉదయం 10:30 గంటలు తెలురుచుకోగా, యమునోత్రి ధామ్ తలుపులు ఉదయం 11:57 గంటలకు పూజారులు తెరిచారు.
అనంతరం ఆయా పుణ్యక్షేత్రాల్లో పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. యాత్రను పురస్కరించుకొని రెండు ఆలయాలను పూల దండలతో అలంకరించారు. ముక్బా గ్రామంలో ఆరు నెలల శీతాకాలం తర్వాత, గంగాదేవి పల్లకీని నిన్న గంగోత్రి ధామ్‌కు పంపగా బుధవారం గంగోత్రి చేరగానే ఆలయం తలుపులు తెరిచారు.
యాత్రలో భాగంగా మే 2న కేదార్‌నాథ్, మే 4న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరువనున్నారు. జమ్మూకశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొనడంతో చార్ ధాయ్ యాత్ర భక్తుల కోసం అధికార యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.