America | అమెరికాలోని టెక్సాస్‌లో భారీ పేలుడు సంభవించింది. డిమ్మిట్‌లోని సౌత్ ఫోర్క్ డెయిరీ ఫాంలో హఠాత్తుగా సంభవించిన పేలుడుకు 18 వేల ఆవులు మృత్యువాతపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాద ఘటన ఏప్రిల్ 10న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
18 వేల ఆవుల విలువ 36 మిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని అంచనా వేశారు. 2013 తర్వాత డెయిరీ ఫాంలలో ఇంత పెద్ద ప్రమాదం జరగడే ఇదే తొలిసారి అని స్థానిక జంతు సంరక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
డెయిరీ ఫాంలోని యంత్రాలు బాగా వేడెక్కడం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ పేలుడు జరగడంతో ఒక్కసారిగా అధికమొత్తంలో మీథేన్ వాయువు విడుదలైందని, ఆ వాయువును పీల్చుకోవడంతోనే ఆవులు మృతి చెంది ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియాల్సి ఉంది. డెయిరీ ఫాంలలో సాధారణంగానే మీథేన్ వాయువు వెలువడుతుంది. ఎందుకంటే పేడ ఎక్కువగా నిల్వ ఉండటం ద్వారా మీథేన్ బయటకు వస్తుంది.
What does it take for you to see? #Repost @marc_galapagos with @use.repost
・・・
Sound on