Site icon vidhaatha

అద్దె చెల్లించడం లేదని MPDO కార్యాలయానికి తాళం.. బయటే వేచి చూస్తున్న సిబ్బంది

విధాత బ్యూరో, కరీంనగర్: అద్దె డబ్బు చెల్లించడంలేదని.. ఓ ప్రభుత్వ కార్యాలయానికే తాళం వేశాడు ఓ యజమాని. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట ఎంపీడీవో కార్యాలయానికి ఇంటి యజమాని చింతిరెడ్డి మల్లారెడ్డి తాళం వేయడంతో.. ఆఫీస్ సిబ్బందంతా బయటే వేచి చూస్తూ కూర్చోవాల్సిన వింత పరిస్థితి నెలకొంది.

గత పదహారు నెలలుగా ఇంటి అద్దె , విద్యుత్ బిల్లు కట్టడం లేదని ఆరోపించిన ఇంటి యజమాని.. ఆగ్రహంతో తాళం వేయడం ఇల్లందకుంటలో చర్చనీయాంశంగా మారింది. మొత్తం ఆఫీస్ అద్దె 1 లక్షా 45 వేల రూపాయలు రావాలంటున్నాడు సదరు యజమాని.

గత నాలుగేళ్లుగా అద్దె భవనంలోనే ఎంపీడీవో కార్యాలయం కొనసాగుతోంది. మరోవైపు కరెంట్ బిల్లు 21 వేల రూపాయలు కూడా చెల్లించక పోవడంతో.. విద్యుత్ అధికారులు తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నాడు మల్లారెడ్డి.

Exit mobile version