Ms Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఇండియన్ క్రికెట్ స్థాయిని పెంచిన ధోని కొన్నేళ్ల క్రితం రిటైర్మెంట్ ప్రకటించాడు.అయిన కూడా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ధోని 42వ బర్త్ డే సందర్భంగా ఆయన కోసం భారీ ఎత్తున కటౌట్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో కూడా ధోని కటౌట్ ప్రత్యక్షం కావడం ఆయన క్రేజ్ ఏంటో అందరికి తెలియజేసింది. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోని ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా తనలో బ్యాట్ జుళీపించే సత్తా ఇంకా ఉందని నిరూపించారు. అయితే ధోనిని నెంబర్ వన్ స్థానంలో నిలిపిన బ్యాట్ ఇప్పుడు జాన్ అబ్రహం వద్ద ఉందట.
ధోని, జాన్ అబ్రహం తొలిసారి కలిసినప్పుడు ధోని తన బ్యాట్ ని బహుమతిగా ఇచ్చాడట. ఈ విషయాన్ని జాన్ అబ్రహం ఓ షోలో చెప్పారు. ఇక ధోని ఇచ్చిన గిఫ్ట్‌కి జాన్ అబ్రహం కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. హెల్మెట్, జాకెట్‌ను బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు జాన్ అబ్రహం. ధోనికి బైక్ రైడ్ అంటే చాలా ఇష్టమని తెలుసుకున్న జాన్ అబ్రహం రిటర్న్ గిఫ్ట్‌గా ఆ రెండు ఇచ్చారట. ధోని బర్త్ డే సందర్భంగా ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ధోని క్రికెట్‌తోనే కాదు యాడ్స్‌తోను పలు బిజినెస్‌లతోను భారీగానే సంపాదించాడు.
ప్రస్తుతం 35కు పైగా బ్రాండ్ యాడ్స్‌లో నటిస్తున్న ధోని బ్రాండ్ విలువ $80.3 మిలియన్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.663 కోట్లు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయన బ్రాండ్ విలువ పెరుగుతుండడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ఇక ధోని తన కెప్టెన్సీతో పాటు ఆట తీరుతో భారత్ ను ఏకంగా టి20 విశ్వవిజేతగా నిలిపాడు. అనంతరం 2011 వన్డే ప్రపంచకప్.. 2013 చాంపియన్స్ ట్రోఫీతో క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. ఇప్పటి యువ క్రికెటర్స్‌కి ధోని చాలా ఆదర్శం. ఆయన మాదిరిగా క్రికెట్ ఆడాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. గ్రౌండ్‌లో కూల్‌గా ఉంటూ అద్భుతాలు చేయడం ధోని వల్లనే సాధ్యం.