Nalgonda | నకిలీ పత్తి విత్తనాల ముఠా అరెస్ట్.. రూ.1 కోటి 80 లక్షల విత్తనాలు స్వాధీనం: SP అపూర్వ రావు

Nalgonda విధాత: నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వ్యవసాయశాఖ అధికారులతో కలిసి దాడులు నిర్వహించిన నల్లగొండ పోలీస్ శాఖ తాజాగా నకిలీ పత్తి విత్తనాల విక్రయ ముఠాను అరెస్ట్ చేసింది. బుధవారం ఉదయం 05.00 గంటలకు నార్కట్ పల్లి పోలీసుస్టేషన్ ఎస్ ఐలు డి.సైదా బాబు, విజయ్ కుమార్, ఈ.రవి, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, వ్యవసాయశాఖ అధికారులు ముందస్తు సమాచారంతో నార్కెట్ పల్లి […]

  • Publish Date - June 14, 2023 / 12:59 PM IST

Nalgonda

విధాత: నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వ్యవసాయశాఖ అధికారులతో కలిసి దాడులు నిర్వహించిన నల్లగొండ పోలీస్ శాఖ తాజాగా నకిలీ పత్తి విత్తనాల విక్రయ ముఠాను అరెస్ట్ చేసింది.

బుధవారం ఉదయం 05.00 గంటలకు నార్కట్ పల్లి పోలీసుస్టేషన్ ఎస్ ఐలు డి.సైదా బాబు, విజయ్ కుమార్, ఈ.రవి, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, వ్యవసాయశాఖ అధికారులు ముందస్తు సమాచారంతో నార్కెట్ పల్లి ఫ్లైఓవర్ పై వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ త‌నిఖీల్లో భారీ మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకొని వాటిని సరఫరా చేసే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ అపూర్వ రావు తెలిపారు.

వారి నుంచి 1 కోటి 80 లక్షల విలువ చేసే (10 వేల కిలోల) 200 బస్తాల నకిలీ విత్తనాలను, ఒక ఎర్టిగా కారు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గోరంట్ల నాగార్జున, గడ్డం రవీంద్రబాబు, మెరిగే వేణులను అరెస్టు చేయగా మరో నిందితుడు నరసింహ పరారీలో ఉన్నారు.

కర్ణాటక స్టేట్ లో కొంత మంది రైతుల దగ్గర నుండి పత్తి విత్తనాలు తక్కువ ధ‌రకు కొనుగోలు చేసి గుంటూరు జిల్లా దాచపల్లి దగ్గర స్టోరేజ్ చేసి అక్కడ నుండి మహారాష్ట లోని నాగపూర్ కి చెందిన రైతులకు ఎక్కువ ధరకు అమ్మ‌డానికి తరలిస్తుండగా వీరిని అదుపులోకి తీసుకొని రిమాండుకి తరలించిన‌ట్టు ఎస్పీ తెలిపారు.

పట్టుబడిన విత్తనాలను నేరస్థులు BG 3 అని చెప్పగా, వాటిని పరీక్షల నిమిత్తం వ్యవసాయ అధికారుల ద్వారా సీడ్ టెస్టింగ్ లాబ్ మలకపెట్ కి పంపించి నిర్దారణ చేయడం జరుగుతుందన్నారు. అలాగే ఈ హెర్బి సైడ్ టలారెన్స్ పత్తివిత్తనాలను జీఇఏసి నిషేదించబడినవన్నారు. వీటిని వేసుకోవడం వల్ల వాతావరణ కాలుష్యం మానవాళికి ఇబ్బందికరమని నిర్ధారించడం వల్ల ఈ విత్తనాలను వాడి మోసపోవద్దని ఎస్పీ తెలిపారు.

నిందితులపై పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తాం..

ఈ తరహాలో రైతులను మోసం చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, నకిలీ విత్తనాలు అమ్మినా, సరఫరా చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పి.డీ. యాక్ట్ పెడతామని హెచ్చరించారు. రైతులు నకిలీ విత్తనాల ముఠాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తక్కువ ధరలకే విత్తనాలు విక్రయించే వారి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

నల్లగొండ పోలీసు మరియు వ్యవసాయశాఖ బృందాలు వీటి గురించి.. అన్నదాతలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న ముఠాలపై నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ తరహా ముఠాల గురించి సమాచాం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరుతున్నాం.

లైసెన్స్ దారులు అమ్మే విత్తనాల ప్యాకెట్ మీద పూర్తి వివరాలు ఉంటాయని, రైతులు విత్తనాలు కొనేటప్పుడు వీటిని గమనించాలన్నారు. ఇలాంటి వాటి పట్ల అన్నదాతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

నకిలీవిత్తనాల ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన నల్లగొండ డి.యస్.పి నరసింహారెడ్డి ఆధ్వ‌ర్యంలో చిట్యాల సి.ఐ శివ రామ్ రెడ్డి, నార్కెట్ పల్లి యస్.ఐ సైదా బాబు, చిట్యాల యస్.ఐ రవి, యస్.ఐ విజయ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ సురేందర్, కానిస్టేబుల్స్ శివ శంకర్, గిరిబాబు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Latest News