Site icon vidhaatha

విశాఖపట్నం: మత్తు ఇంజక్షన్ల రాకెట్‌కు చెక్

విధాత, విశాఖపట్నం: యువతను పెడతోవ పట్టిస్తున్న వాటిలో ప్రధానమైనది మద్యం, డ్రగ్స్‌, మత్తు ఇంజెక్షన్లను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో గంజాయి అమ్మకాలు, గంజాయితో తయారు చేసిన చాక్‌లెట్‌ లాంటి ఉత్పత్తులు పాఠశాల స్థాయి వరకు విస్తరించాయి.

వీటన్నింటిలో అతి ప్రమాదకరమైనవి మత్తు ఇంజెక్షన్లు. ఇవి కూడా ఈ మధ్య కాలంలో విరివిగా సరఫరా అవుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోంచే.. మత్తు ఇంజెక్షన్ల సరఫరా గుట్టుచప్పుడు కాకుండా విశాఖ వన్‌టౌన్‌ పరిధిలో జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆ రాకెట్‌ గుట్టును రట్టు చేశారు.

జాలారిపేటలో మత్తు ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ఒకరిని టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రెడ్‌ఆఫ్‌ ఇంజక్షన్లు 490 యాంపిల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఏపీలోనే కాకుడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మత్తు ఇంజెక్షన్ల సరఫరా గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

Exit mobile version