BiggBossTelugu8
సెప్టెంబర్1న ప్రారంభమై మొత్తంగా 106 రోజుల పాటు సాగిన రియాలిటీషో తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 BiggBossTelugu8 డిసెంబర్ 15 ఆదివారంతో ముగిసింది. చివరకు ప్రేరణ, నిఖిల్, అవినాష్, గౌతమ్, నబీల్ టాప్5లో నిలవగా నటుడు నిఖిల్ విన్నర్‌గా , గౌతమ్‌కృష్ణ రన్నరప్‌గా నిలిచారు. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ షోకు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతకు బిగ్‌బాస్ ట్రోఫీని, రూ.55 లక్షల ఫ్రైజ్‌మనీని అందజేశారు.
కార్యక్రమంలో కన్నడ స్టార్ ఉపేంద్ర, తమిళ స్టార్ విజయ్ సేతుపతి, మంజు వారియర్‌లు తమ సినిమాల ప్రమోషన్ నిమిత్తం అతిథులుగా వచ్చి కాసేపు సందడి చేశారు. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లంత ఫీనాలేకు హజరయ్యారు. కన్నడ భామలు నభానటేశ్,లక్ష్మిరాయ్‌లు తమ డ్యాన్సులతో అలరించారు.