Site icon vidhaatha

Minister Sidiri Appalaraju | వైసీపీకి ఓట్లు అనుకూలంగా లేకుంటే తొలగించండి: మంత్రి అప్పలరాజు

Minister Sidiri Appalaraju

విధాత, వైసీపీ అనుకూలంగా లేని ఓట్లను తొలగించడని ఏపి మంత్రి సిదిరి అప్పలరాజు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పలాసలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన అప్పలరాజు ప్రతిపక్షాల ఓట్లు తొలగించడంటు స్టేజీ మీదనే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మన ఓట్లు అనుకుంటే పరవాలేదని, మనవి కావు అనుకుంటే అటువంటి ఓట్లపై అబ్జెక్షన్ చేస్తు ఫామ్ 7 పెట్టాలని వాలంటీర్లకు సూచించారు.

మన ప్రతి పక్ష నాయకుడి మద్దతుదారులుగా ఉండే వారి ఓట్లు తొలగించండని బహిరంగంగా వాలంటీర్లకు మంత్రి అప్పరాజు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఇప్పటికే జనసేన, టీడీపీ పార్టీలు తమ మద్ధతుదారుల ఓట్లను ఓటర్ లిస్టుల నుండి ప్రభుత్వం అక్రమంగా తొలగింపచేస్తుందంటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో మంత్రి సిదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు మరింత రగడకు దారితీసే పరిస్థితి కనిపిస్తుంది.

Exit mobile version