Site icon vidhaatha

Honey bees | తేనెటీగల దాడి: బావిలో దూకిన అన్నదమ్ములు.. ఈత రాక అన్న మృతి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తేనెటీగల (Honey bees) దాడి ఆ ఇంట విషాదం నెలకొల్పింది. ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. ప్రాణాలు కాపాడుకునే క్రమంలో బావిలో దూకడంతో ఒకరు మృతి చెందిన సంఘటన మానుకోట జిల్లాలో శుక్రవారం జరిగింది.

జిల్లాలోని కొత్తగూడ మండలం నీలంపల్లికి చెందిన అన్నదమ్ములు కోన్రెడ్డి సంజీవరెడ్డి, జనార్దన్ ఉదయం పొలం పనులకు వెళ్లారు. పనులు చేస్తుండగా తేనెటీగలు దాడి చేయడంతో పరుగులు పెట్టారు.

ఈ క్రమంలో తేనెటీగల నుంచి తప్పించుకోవడానికి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో అన్నదమ్ములు ఇద్దరు దూకారు. అయితే కోన్రెడ్డి సంజీవరెడ్డికి ఈత రాకపోవడంతో మునిగి మృతి చెందాడు. తమ్ముడు జనార్దన్ ప్రాణాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version