Site icon vidhaatha

Pagalankarana Seva | లింగోద్భవ కాలంలో నేడు శ్రీశైల మల్లన్నకు పాగాలంకరణ..! ఈ మకుటం విశేషమేంటంటే..?

Pagalankarana Seva | మహా శివరాత్రి (Maha Shivaratri) వేడుకలు జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన శ్రీశైలం (Srisailam)లో వైభవంగా సాగుతున్నాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇవాళ మల్లికార్జునస్వామికి పాగాలంకరణ జరుగునుండగా.. అందరి చూపు ఈ కార్యక్రమంపైనే ఉన్నది. శ్రీశైలంలో పాగాలంకరణకు ప్రత్యేక విశిష్టత ఉన్నతి. శైవక్షేత్రాల్లో మర్కెడా లేని విధంగా ఈ విశిష్ట సేవ శ్రీశైలంలో మూడు తరాలుగా కొనసాగుతూ వస్తున్నది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో లింగోద్భవ కాలంలో జరిగే పాగాలంకరణ కార్యక్రమం కనుల పండువగా జరుగనున్నది. శ్రీగిరి పర్వతంపై స్వంభువుగా వెలసిన మల్లికార్జునుడు శ్రీలింగచక్రవర్తిగా సేవలందుకుంటున్నాడు.

ఆగమశాస్త్రంలో..

ఆగమశాస్త్రాల్లోని రాజోపచారాల్లో ఛత్రం, చామరం, వాహనం, నృత్యం, గీతం, వాద్యం, మకుటం తదితర ఉపచారాలు నిర్వహించడం సహజం. ఇందులో మకుటంగా కిరీటం, తలపాగాను వినియోగిస్తారు. తాత్వికపరంగా ప్రపంచం భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచభూతాలతో నిండి ఉంది. పంచభూతాలకు ప్రతీకగా స్వామివారి గర్భాలయ విమాన గోపురానికి మధ్యలో ప్రధాన కలశం నలుమూలలా నాలుగు కలశాలుగా చెప్పవచ్చు. అలాగే వృషభం ధార్మికతకు ప్రతీక అయితే గర్భాలయ ముఖమండపంపై ఉన్న నవనందులు, 5 కలశాలకు కలిపి పాగా చుట్టబడుతుంది. 14 లోకాల్లో మల్లన్న అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ ఈ సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.

మూడు తరాలుగా ఆ కుటుంబం

ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన ఫృధ్వీ వెంకటేశ్వర్లు అనే భక్తుడి కుటుంబం మూడు తరాలుగా శ్రీశైలమల్లన్నకు పాగాను అలంకరిస్తోంది. స్వామివారికి పాగాను వంశపారంపర్యంగా సమర్పిస్తున్నారు. ఏడాదిపాటు దీక్షలో ఉండి రోజుకు ఒక మూర చొప్పున 365 రోజులు పాగా వస్త్రాన్ని భక్తి శ్రద్ధలతో నేస్తారు. మల్లన్నకు మహాశివరాత్రి రోజున నిర్వహించే పాగాలంకరణను దర్శించడం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహంతో ఆ ఏడాది అంతా శుభాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కల్యాణోత్సవానికి ముందు పెండ్లికుమారుడికి తలపాగా చుట్టే ఆచారాన్ని అనుసరించి తరతరాలుగా ఏటేటా పాగాలంకరణ సేవ చేస్తున్నది ఈ కుటుంబం. స్వామివారిని పాగాను ఎంతో భక్తి, దీక్షతో ప్రతిరోజు ఉదయం ఒక మూరచొప్పున 365 రోజులపాటు నేస్తుంది.

ఒంటిపై నూలుపోగు లేకుండా..

మహాశివరాత్రి పర్వదినం నాటికి శ్రీశైలం చేరిన సదరు కుటుంబానికి దేవస్థానం ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికి ఆతిధ్యం ఇస్తోంది. ఫృధ్వీ వెంకటేశ్వర్లు శివరాత్రి రోజున చిమ్మచీకట్లో దిగంబరుడై స్వామివారి గర్భాలయ విమాన కలశాలు, ముఖమండప నవనందులను కలుపుతూ పాగాను అలంకరిస్తారు. ఒంటిపై నూలు పోగు లేకుండా చిమ్మచీకటిలో పాగా అలంకరణ చేయడం ఇక్కడ విశిష్టత. వీటిని శ్రీశైలానికి వచ్చిన అశేష భక్తజనం తిలకించి పులకించిపోతుంది.

Exit mobile version