Site icon vidhaatha

Mahbubabad: చింతపండు కోసం పంచాయితీ.. తమ్ముడిని కత్తితో పొడిచిన అన్న

విధాత‌: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లి గ్రామంలో అన్నదమ్ముల మధ్య చింతకాయ పంపకం విషయంలో వచ్చిన ఘర్షణ తీవ్రంగా మారింది. అన్న గాదగోని రమేష్ కత్తితో తమ్ముడు నరేష్ పై దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు.

ఇంటి ఆవరణలో ఉన్న చింత చెట్టు చింతకాయ దులుపుతున్న క్రమంలో ఇద్దరి మధ్య‌ వివాదం చోటు చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం నరేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Exit mobile version