Site icon vidhaatha

Parliament | కొత్త పార్లమెంటు భవనంలో ప్రత్యేక సమావేశాలు

Parliament |

విధాత, ఈ నెల 18నుంచి 22వరకు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నూతన పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టాలోనే నిర్వహించనున్నారని ఢిల్లీ వర్గాల సమాచారం. పాత పార్లమెంటు భవనం నుంచి సమావేశాల నిర్వాహణ 19వ తేదిన వినాయక చవితి రోజున కొత్త పార్లమెంటు భవనంలోకి మారుతాయని తెలుస్తుంది. కొత్త భవనాన్ని గత మే 28న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.

ఈ దఫా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్‌, మహిళా రిజర్వేషన్ బిల్లు, దేశం పేరును భారత్‌గా మార్చడం సహా పలు కీలక బిల్లులు ప్రవేశపెడుతారని భావిస్తున్నారు. గతంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు 1962లో నవంబర్ 8,9తేదీలలో భారత్ చైనా యుద్ధ పరిస్థితులపై చర్చించేందుకు నిర్వహించారు.

2015 నవంబర్ 26,27తేదీలలో రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌.అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పించేందుకు మరోసారి నిర్వహించారు. భారత దేశ స్వాతంత్ర 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా 1997 ఆగస్టు 26నుంచి సెప్టెంబర్ 1వరకు మరోసారి ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.

2017 జూన్ 30న పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని జీఎస్టీ బిల్లు చర్చ కోసం నిర్వహించారు. అంతకుముందు 1947 ఆగస్టు 14,15 తేదిల్లో తొలి స్వాతంత్య్ర వేడుకల ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. క్విట్ ఇండియా ఉద్యమం 50 ఏళ్ల సందర్భంగా 1992 ఆగస్టు 9న, పాతికేళ్ల దేశ స్వాతంత్య్రం పురస్కరించుకుని 1972ఆగస్టు 14,15తేదీలలో కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.

Exit mobile version