PM Of Bharat | ప్రైమ్ మినిస్ట‌ర్ ఆఫ్ భార‌త్.. ఏషియన్ ఆహ్వాన లేఖ‌పై వివాదం..

PM Of Bharat | విధాత‌: ఇండియా పేరును భార‌త్‌గా మార్చేందుకు కేంద్రం సిద్ధ‌మైట‌న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. జీ-20 స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యే ప్ర‌పంచ దేశాల అతిథుల‌కు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము విందు ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ విందుకు ఆహ్వానించిన లేఖ‌ల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్ అని రాసిన సంగ‌తి తెలిసిందే. ఈ అంశంపై తీవ్ర దుమారం రేగిన విష‌యం విదిత‌మే. తాజాగా ఏషియ‌న్ స‌మ్మిట్ ఆహ్వాన లేఖ‌పై వివాదం నెల‌కొంది. ఎందుకంటే ఈ లేఖ‌లో […]

  • Publish Date - September 6, 2023 / 07:13 AM IST

PM Of Bharat |

విధాత‌: ఇండియా పేరును భార‌త్‌గా మార్చేందుకు కేంద్రం సిద్ధ‌మైట‌న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. జీ-20 స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యే ప్ర‌పంచ దేశాల అతిథుల‌కు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము విందు ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ విందుకు ఆహ్వానించిన లేఖ‌ల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్ అని రాసిన సంగ‌తి తెలిసిందే. ఈ అంశంపై తీవ్ర దుమారం రేగిన విష‌యం విదిత‌మే.

తాజాగా ఏషియ‌న్ స‌మ్మిట్ ఆహ్వాన లేఖ‌పై వివాదం నెల‌కొంది. ఎందుకంటే ఈ లేఖ‌లో ప్రైమ్ మినిస్ట‌ర్ ఆఫ్ భార‌త్ అని పేర్కొన‌డ‌మే ఇందుకు కార‌ణం. ఇండోనేషియాలో జ‌రిగే 20వ ఏషియ‌న్ – ఇండియా స‌మ్మిట్‌లో పాల్గొనేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇవాళ ఇండోనేషియా వెళ్తున్నారు. దీంతో పాటు 18వ ఈస్ట్ ఏషియా స‌ద‌స్సులోనూ మోదీ పాల్గొటారు.

అయితే ఆ వేడుక‌ల కోసం రూపొందించిన ఇన్విటేష‌న్‌పై ప్రైమ్ మినిస్ట‌ర్ ఆఫ్ ఇండియాకు బ‌దులుగా ప్రైమ్ మినిస్ట‌ర్ ఆఫ్ భార‌త్ అని రాశారు. దేశం పేరును మార్చాల‌ని కేంద్ర స‌ర్కార్ భావిస్తున్న నేప‌థ్యంలో.. ఏషియాన్ స‌మ్మిట్‌ ఇన్విటేష‌న్‌లో ప్రైమ్‌ మినిస్ట‌ర్ ఆఫ్ భార‌త్‌గా పేర్కొన‌డం మరోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ప్రైమ్ మినిస్ట‌ర్ ఆఫ్ భార‌త్‌గా పేర్కొన్నఏషియాన్ ఇన్విటేష‌న్ కార్డును బీజేపీ జాతీయ ప్ర‌తినిధి సంబిత్ పాత్ర త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ పోస్టుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తింది. మోదీ స‌ర్కార్ ఈ దేశ ప్ర‌జ‌ల్ని గంద‌ర‌గోళానికి గురి చేస్తోంద‌ని కాంగ్రెస్ నేత జైరాం ర‌మేశ్ ఆరోపించారు.

Latest News