వేగంగా క‌దులుతున్న రైలులో పెళ్లి.. వీడియో

మెట్రో రైళ్లు, రైల్వే ప్లాట్‌ఫామ్స్, ఇత‌ర బ‌హిరంగ ప్ర‌దేశాల్లో యువ‌త వినూత్న స్టంట్ల‌కు పాల్ప‌డి సోష‌ల్ మీడియాలో హైలెట్ అవుతున్నారు.

  • Publish Date - December 5, 2023 / 03:36 AM IST

విధాత‌: మెట్రో రైళ్లు, రైల్వే ప్లాట్‌ఫామ్స్, ఇత‌ర బ‌హిరంగ ప్ర‌దేశాల్లో యువ‌త వినూత్న స్టంట్ల‌కు పాల్ప‌డి సోష‌ల్ మీడియాలో హైలెట్ అవుతున్నారు. మెట్రో రైలు లోప‌ల డ్యాన్స్‌లు చేయ‌డం, ప్లాట్‌ఫామ్స్‌పై కూడా నృత్యాలు, ఇత‌ర స్టంట్ల‌కు పాల్ప‌డుతూ ట్రెండింగ్‌లో ఉంటున్నారు. ఆ మాదిరిగానే ఓ జంట వేగంగా క‌దులుతున్న రైలులో వివాహం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఈ వివాహానికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.


ఓ యువ‌తీయువ‌కుడు రైలులో ప్ర‌యాణిస్తున్నారు. ఇక ప్ర‌యాణికులంద‌రూ చూస్తుండ‌గానే ఆ యువ‌తి మెడ‌లో యువ‌కుడు తాళి క‌ట్టాడు. అనంత‌రం ఇద్ద‌రు దండ‌లు మార్చుకున్నారు. ఆ త‌ర్వాత భ‌ర్త నుంచి భార్య ఆశీర్వాదం తీసుకుంది. కౌగిలింతల‌తో ఒక్క‌ట‌య్యారు. ఇక రైలులో పెళ్లి చేసుకున్న ఆ జంట‌కు ప్ర‌యాణికులు శుభాకాంక్ష‌లు తెలిపి ఆశీర్వ‌దించారు. ఈ పెళ్లి కుటుంబ పెద్దల స‌మ‌క్షంలోనే జ‌రిగిన‌ట్లు తెలిసింది. అస‌న్‌సాల్ – జ‌షీద్ రైలులో ఈ వివాహ వేడుక జ‌రిగింది.