Pawan Kalyan
- ఉత్తరాంధ్రలో నాదెళ్ల మనోహర్ పర్యటన
విధాత: ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలు తమ ప్లాన్లకు పదును పెడుతున్నాయి. ఎవరి శక్తి మేరకు వారు ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ ఓట్లు, సీట్లు సాధించే పథకాలు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబును పవన్ కళ్యాణ్ నిన్న హైదరాబాద్ లో కలిశారు. రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ కలిసి వెళ్లాలని మొదటి నుంచి ఓ అవగాహనా ఐతే ఉంది. కాకుంటే ఎవరికీ ఎన్ని సీట్లు,,, ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయం కాలేదు.
ఇక మొదటి నుంచీ పవన్ చెబుతున్నది ఒకటే… ప్రతిపక్ష ఓట్లు చీలనివ్వను, జగన్ కు వ్యతిరేకంగా ఎంతమంది, ఎన్ని పార్టీలు పోటీ చేసినా అవన్నీ ఒకే పార్టీగా.. అంటే ఒక గ్రూపుగా ఐక్యంగా కలిసి పోరాడుదాం అంటున్నారు.
ఇదే క్రమంలో పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ నిన్న నేడు విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించారు. కార్యకర్తలతో మాట్లాడారు… రానున్న ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, పార్టీ ఎటు నడిపిస్తే అటు నడిచేందుకు ఉద్యుక్తులై ఉండాలని సూచించారు.
మరోవైపు పవన్ వారాహి కూడా త్వరలో రోడ్డు ఎక్కనుంది. ఆయన సైతం జిల్లాల పర్యటనకు ప్రణాళిక రూపొందించారు. మొత్తానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ మరోమారు జగన్ను ఎదుర్కొనేందుకు అస్త్ర శాస్త్రాలు సిద్ధం చేస్తున్నారు.