కొండ ప్రాంతాల్లో పోలింగ్‌.. సిబ్బందికి సాహస యాత్రలే

దేశ సార్వత్రిక ఎన్నికల నిర్వాహణ చిత్ర విచిత్రాలతో పాటు సాహసోపేత ఘట్టాలకు కూడా వేదికవుతుంది

  • Publish Date - April 18, 2024 / 04:40 PM IST

విధాత: దేశ సార్వత్రిక ఎన్నికల నిర్వాహణ చిత్ర విచిత్రాలతో పాటు సాహసోపేత ఘట్టాలకు కూడా వేదికవుతుంది. కొండలు..గుట్టలు…అటవీ ప్రాంతాల్లో ఉండే జనావాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ఎన్నికల సిబ్బంది పడుతున్న పాట్లు సాహస యాత్రనే తలపిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు పోలింగ్ సిబ్బంది సర్కస్ ఫీట్ల స్థాయిలో సాహసాలే చేశారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లా రుంగాంగ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి చేరుకునేందుకు పోలింగ్ సిబ్బంది లోయలు దాటి కొండలు ఎక్కుతూ చేసిన సాహసం హిమాలియన్ ట్రెక్కింగ్‌ను తలపించేలా సాగింది. స్థానికులు వారికి సహకరించడంతో వారు తమ ప్రయత్నంలో ఎట్టకేలకు విజయం సాధించి తాము పోలింగ్ విధులను నిర్వహించాల్సిన పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Latest News