Project-K Prabhas
విధాత: ప్రభాస్ నటించిన ప్రాజెక్ట్-K (కల్కి-2898 AD) గ్లింప్స్ విడుదల కోసం అమెరికా శాన్తియాగో వెళ్లిన చిత్ర చిత్రబృందానికి అక్కడి అభిమానులు వినూత్నంగా స్వాగతం పలికారు. ప్రభాస్ కు వెల్కం చెబుతున్న పోస్టర్ను ఓ జెట్ విమానం వెనక కట్టి ఆకాశంలో ప్రదర్శించారు.
దీన్ని అక్కడి భారతీయులతోపాటు స్థానికులు కూడా ఆసక్తిగా తిలకిస్తూ తమ కెమెరాల్లో బంధించారు. అయితే ప్రాజెక్ట్ – కె సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోనూ హలీవుడ్ అడ్డా కామిక్ కాన్ ఈవెంట్లో విడుదల చేశారు మేకర్స్. ఈ గ్లిమ్స్ చూసిన ప్రభాస్ అభిమానులు, సినిమా ప్రియులంతా ఇది గ్లిమ్స్ కాదు గూస్ బంమ్స్ అనేస్తున్నారు. మరో వైపు కొందరు ట్రోలర్స్ మాత్రం ఈ గ్లిమ్స్ కొన్ని హాలివుడ్ సినిమాలకు కాపీలా ఉందని వెల్లడిస్తున్నారు.