- హైదరాబాద్‌లోని హోటళ్లకు అర్వింద్‌కుమార్ ఆదేశాలు
- చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు
విధాత: హైదరాబాద్‌లోని అన్ని హోటళ్లలో శుద్ధి చేసిన తాగునీటిని వినియోగదారులకు ఉచితంగా అందించాలని పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు.
ఒకవేళ హోటళ్లు, రెస్టారెంట్లలో తప్పనిసరి పరిస్థితుల్లో బాటిల్స్ సరఫరా చేస్తే ఆయా బాటిల్‌పై ముద్రించిన గరిష్ట ధరకు మించి అమ్మకూడదని హెచ్చరించారు. వేర్వేరు బ్రాండ్ల పేరుతో అత్యధిక ధరకు విక్రయించి నీళ్ల బాటళ్లు విక్రయిస్తున్నారని ఓ స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన అర్వింద్ కుమార్ తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు జారీచేశారు.