విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని హోటళ్లు..రెస్టారెంట్లు..మాల్స్‌లో కాలం చెల్లిన, నాసిరకం ఆహార పదార్ధాలు పట్టుబడిన తీరు కలకలం రేపింది. వాటి నిర్వాహకులు ఆహార పదార్ధాల నాణ్యతను పట్టించుకోకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాతున్న విషయం మరోసారి వెలుగుచూసింది. ఆదివారం ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్సు బృందాల దాడుల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్‌లలో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులు ఆహార ప్రియులను భయపెట్టేలా ఉన్నాయి. రాయలసీమ రుచుల హోటల్లో నాసిరకం మైదా పట్టుబడగా, భారీగా నిలువ చేసిన పాడైన పసుపు వెల్లుల్లి పేస్ట్ ను సీజ్ చేశారు.
సరైన అనుమతి లేకుండా గోలి సోడా అమ్మకాలు చేస్తున్నారని, కిచెన్‌లో బొద్ధింకల గుర్తింపువ, అపరిశుభ్రతలను గుర్తించారు. శాగౌస్ హోటల్లో నాసిరకం వంటకాల తయారీ, కామత్ హోటల్‌లో సీలు లేని టీ పౌడర్ గుర్తించగా, ఫుడ్ సర్టిఫికెట్ తీసుకోకుండా వంటకాల తయారీ చేస్తున్నారని నిర్ధారించారు. సుక్‌సాగర్ రెస్టారెంట్‌లో కాలం చెల్లిన పుట్టగొడుగులు పట్టుబడగా, ఫైవ్ స్టార్ ఫుడ్ కోర్టులో నాణ్యతలేని ఆహార పదార్ధాలు గుర్తించగా, రత్నదీప్ మాల్‌లో నాసిరకం చాక్లెట్లు లభ్యమయ్యాయి. కేఎఫ్‌సీకి ఫుట్ సేఫ్టీ అథార్టీ అనుమతి లేదని గుర్తించడంతో పాటు క్వాలిటీలేని పిజ్జాలు సీజ్ చేశారు.