Site icon vidhaatha

Pushpa 2 | భన్వర్ సింగ్ షెకావత్.. ఈసారి బాంబ్‌లా పేలతాడేమో లుక్ అదిరింది

Pushpa 2 |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబోలో సెన్సేషన్‌ని క్రియేట్ చేసిన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాలో ‘పార్టీ లేదా పుష్ప’ అంటూ ఫహద్ ఫాజిల్ చెప్పిన డైలాగ్ ఎంతగా పాపులర్ అయిందో తెలియంది కాదు. మలయాళ నటుడే అయినా ఫహద్ ఫాజిల్‌కు, ఆయన నటనకు తెలుగులోనూ ఎంతో మంది అభిమానులున్నారు.

అలాంటి నటుడికి ‘పుష్ప’ చిత్రం ఇంకా మంచి గుర్తింపును తీసుకు వచ్చిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మంగళవారం (ఆగస్ట్ 08) ఫహద్ ఫాజిల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘పుష్ప 2 ద రూల్’ నుంచి అతని లుక్‌తో కూడిన కొత్త పోస్టర్‌ని బర్త్‌డే విశెష్ తెలుపుతూ మేకర్ష్ విడుదల చేశారు. ఈ లుక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇందులో.. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని స్టైలిష్‌గా సిగరెట్ తాగుతూ కనిపిస్తున్న ఫహద్ పోస్టర్ ఆకట్టుకోవడమే కాదు.. ఈసారి అతను బాంబ్‌లా పేల బోతున్నాడనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ పోస్టర్‌తో ఈ చిత్రంలో ఫహద్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలియజేశారు మేకర్స్. ‘ఈసారి ఆయన ప్రతీకారం తీర్చుకోడానికి వస్తున్నాడు’ అంటూ మేకర్స్ కూడా ఫహద్ ఫాజిల్ ఫోటోపై క్యాప్షన్‌ ఇచ్చారు.

‘పుష్ప ది రైజ్’ లో అల్లు అర్జున్‌, ఫహద్ మధ్య పోటాపోటీగా సాగే సీన్స్.. ‘పుష్ప-2 ది రూల్’పై ఓ రేంజ్‌లో అంచనాలు పెంచేశాయి. పార్ట్ 1 ముగించిన తీరు.. పార్ట్ 2పై ఎంతో క్యూరియాసిటీని పెంచింది. అసలు సుకుమార్ ఈ రూల్‌లో ఏం చూపించబోతున్నాడనేది చాలా ఆసక్తికరంగా మారింది.

ఇక ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ‘వేర్ ఈజ్ పుష్ప’ అనే కాన్సెప్ట్ వీడియో ఎలాంటి స్పందనను రాబట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ‘అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కు వేశాయంటే పులి వచ్చింది అని అర్థం.. అదే పులి రెండు అడుగులు వెనక్కు వేసిందంటే పుష్ప వచ్చుండాడు అని అర్థం’ అని బన్నీ చెప్పే డైలాగ్‌ ఆ వీడియోకే హైలైట్‌. ఆ డైలాగ్స్‌తో ఈసారి సుకుమార్ గట్టిగానే ఇవ్వబోతున్నాడనే క్లారిటీ కూడా వచ్చేసింది.

పాన్ ఇండియా చిత్రంగా దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలోనే విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version