Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై చార్జ్ షీట్

'పుష్ప 2' ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. నిందితుల్లో హీరో అల్లు అర్జున్ (A-11) తో పాటు మొత్తం 23 మంది పేర్లను చేర్చారు.

Allu Arjun chargesheet Sandhya theatre stampede

విధాత, హైదరాబాద్ : పుష్పా 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడిపల్లి పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. హీరో అల్లు అర్జున్ తో పాటు 23 మందిపై చార్జ్ షీట్ దాఖలు చేశారు. సంధ్య ధియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు మేనేజర్ పైన అభియోగాలు నమోదు చేశారు.

పెద్దఎత్తున అభిమానులు ఉన్నారని తెలిసి కూడా సంధ్య థియేటర్ వెళ్ళినందుకు అల్లు అర్జున్ ను నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేసినట్లుగా పేర్కొన్నారు. అల్లు అర్జున్, ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా ఎనిమిది మంది బౌన్సర్లను నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసు ఛార్జిషీట్‌లో ఏ-11గా సినీ నటుడు అల్లు అర్జున్‌ పేరు చేర్చారు. 2024 డిసెంబర్‌ 4న పుష్ప- 2 చిత్రం ప్రీమియర్‌ షో సందర్భంగా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి(35) అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ్‌(9) తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

Kavitha : బీఆర్ఎస్, కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే పాలమూరుకు నీటి గోస
Chiru-Venki | చిరు, వెంకీ క్రేజీ స్టెప్.. రెండు క‌ళ్లు స‌రిపోవ‌డం లేదుగా.. ప్రోమో విడుద‌ల‌

Latest News