Chiru-Venki | మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే సెన్సార్ బోర్డు స్క్రూటినీ పూర్తి కావాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించిన రన్‌టైమ్‌కి సంబంధించి ఇండస్ట్రీలో వినిపించిన బజ్ ప్రకారం, సినిమా మొత్తం 2 గంటల 38 నిమిషాల రన్‌టైమ్‌తో లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇది కొంచెం ఎక్కువేననే చర్చ జరుగుతున్నా, సెన్సార్ అనంతరం రన్‌టైమ్‌తో పాటు ఇతర కీలక వివరాలను మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించనుంది.
ఇప్పటికే విడుదలైన మెగాస్టార్ లుక్స్, సాంగ్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. లుక్స్ చూస్తేనే ఈ చిత్రంలో చిరంజీవి వింటేజ్ స్టైల్‌లో కనిపించనున్నారని అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా ‘మీసాల పిల్ల’ సాంగ్ సెన్సేషన్‌గా మారింది. ఇప్పటివరకు ఈ పాటకు 90 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని చిత్రబృందం వెల్లడించింది. దీనితో పాటు ‘శశిరేఖ’ సాంగ్ కూడా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన వెంకటేష్ లుక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే వీరిద్దరి కాంబోలో ఓ సాంగ్ కూడా ఉంది.
తాజాగా మాస్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ‘ఆర్ యూ రెడీ’ అంటూ సాగే పాటకి సంబంధించిన ప్రోమోలో చిరంజీవి తన మార్క్ గ్రేస్‌తో, వెంకటేష్ తనదైన స్టైల్‌తో అలరించారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ కంప్లీట్ మాస్ సాంగ్‌ను డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది మాస్‌కి మాంచి కిక్ ఇవ్వడం ఖాయం అంటున్నారు. చిత్రంలో కేథరిన్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్ ముఖ్య పాత్రలు పోషించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తుండగా, మెగా గ్రేస్‌కు తగ్గట్లుగా పాటలు రూపొందినట్లు ఇప్పటికే స్పష్టమైంది. వింటేజ్ మెగాస్టార్‌ను భారీ స్క్రీన్‌పై చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
